/rtv/media/media_files/2025/04/20/8UsCS39w9iC9EdNesZNo.jpg)
TELANGANA
ఈ భూమిపై ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది అనడానికి తెలంగాణలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి ఈదురు గాలులు, వర్షాలు దంచి కొడుతున్నాయి. వీటి కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో గాలివాన బీభత్సానికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
Also Read: TS: తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగాలు..సీఎం రేవంత్ ఒప్పందాలు
దీంతో పలు ప్రాంతాల్లో కరెంట్ సప్లైకు తీవ్ర అంతరాయం కలిగింది. కరెంట్ లేక ప్రజలు అల్లాడిపోయారు. ఎటు వెళ్దామన్నా చిట్టమ్మ చీకటి. దీంతో రాష్ట్రంలోని ఓ జిల్లా వాసులకు వచ్చిన ఐడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ
రెండు రోజులుగా కరెంట్ బంద్
గత వారం రోజుల నుంచి వీస్తున్న ఈదురుగాలులు, వర్షం కారణంగా వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గత రెండు రోజులుగా కరెంట్ సప్లై ఆగిపోయింది. దీంతో ఆ గ్రామంలో తాగునీటికి ఆటంకం ఏర్పడింది. అది మాత్రమే కాకుండా స్మార్ట్ ఫోన్లలో మునిగితేలేవారికి.. విద్యుత్ అంతరాయం మరింత ఇబ్బంది పెట్టింది.
రెండు రోజులుగా కరెంట్ లేకపోవడంతో డీజిల్ మోటార్‌కు ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకున్న గ్రామస్తులు
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2025
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో రెండు రోజులుగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
గత్యంతరం లేక చందాలు వేసుకొని డీజిల్ మోటార్ సహాయంతో నీటి సరఫరా చేసుకున్న గ్రామస్తులు… pic.twitter.com/RDShhBjhg2
కరెంట్ లేకపోవడంతో ఫోన్లలోని ఛార్జింగ్ పూర్తిగా అయిపోయి స్విచ్చాఫ్ అయ్యాయి. దీంతో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఇంట్లో టైం పాస్ అవ్వడం లేదు. వేరే వారితో కమ్యూనికేషన్ కట్ అయింది. కరెంట్ వస్తే కానీ ఛార్జింగ్ పెట్టే పరిస్థితి లేదు.
Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
దీంతో ఆ గ్రామస్తులంతా కలిసి పక్కా ప్లాన్ వేశారు. ఊరు ఊరంతా చందాలు వేసుకుని ఒక డీజిల్ మోటార్‌ను రెంట్‌కు తెచ్చుకున్నారు. దాని సహాయంతో తాగునీటిని పట్టుకున్నారు. అంతేకాకుండా ఆ డీజిల్ మోటార్ ద్వారా స్విచ్ బోర్డుకు కరెంట్ సప్లై అందేలా ఏర్పాట్లు చేశారు. దీంతో వెంటనే ఫోన్లన్నీ అక్కడ వాలిపోయాయి. పదుల సంఖ్యలో సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
viral-news | viral-video | latest-telugu-news | telugu-news