దీపావళికి కొత్త రెవెన్యూ చట్టం.. ప్రభుత్వానికి చేరిన దస్త్రం

తెలంగాణలో కొత్త రెవిన్యూ చట్టం అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. పట్టాదారు పాస్‌పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం-2020 స్థానంలో ఆర్వోఆర్‌ 2024ను దీపావళి నుంచి అమల్లోకి తీసుకురానుంది. ప్రతిగ్రామంలో ఒక భూ రక్షకుడిని నియమించనుంది.

author-image
By Kusuma
TELANGANA LOGO
New Update

New Revenue Act : తెలంగాణలో కొత్త రెవిన్యూ చట్టం అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఆగస్టులోనే ఆర్వోఆర్‌-2024 చట్టం ముసాయిదాను సిద్ధం చేసి, అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించిన ప్రభుత్వం దీపావళినుంచి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. అకిరా వచ్చేస్తున్నాడు

గ్రామస్థాయిలో ప్రత్యేక రెవెన్యూ వ్యవస్థ..

ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలోని యాచారం, నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మండలాల్లో సెప్టెంబరులో పైలట్‌ భూ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రజల అభిప్రాయాలు, సూచనలు, చట్టానికి సంబంధించిన దస్త్రం ప్రభుత్వం సమీకరించింది. ఇక గ్రామస్థాయిలో ప్రత్యేక రెవెన్యూ వ్యవస్థ ఉండాలని, సమస్యలపై అప్పిలేట్‌ అథారిటీ, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో భూ కమిషన్‌ ఏర్పాటుచేయాలని జనం కోరుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో మరోసారి వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను అమలు చేయనుంది. 

ఇది కూడా చదవండి: Pushpa 2 : 'పుష్ప2' స్పెషల్ సాంగ్.. రంగంలోకి ప్రభాస్ హీరోయిన్

2020 స్థానంలో ఆర్వోఆర్‌ 2024 రూపకల్పన..

తెలంగాణ పట్టాదారు పాస్‌పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం-2020 స్థానంలో ఆర్వోఆర్‌ 2024 రూపకల్పన ఏర్పాట్లు పూర్తైనట్లు సమాచారం. డ్రాఫ్ట్‌పై అభిప్రాయాలను క్రోడీకరించిన అధికారులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముసాయిదా పత్రాన్ని అందించారు. చట్టం రూపకల్పనకు సంబంధించిన కార్యాచరణపై మంత్రి తాజాగా సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి మండలి సమావేశంలో ముసాయిదాపై చర్చించనున్నారని, అనంతరం శాసనసభ సమావేశాల్లో ఆమోదించడం ద్వారా గానీ, ఆర్డినెన్స్‌ జారీ ద్వారా గానీ కొత్త చట్టాన్ని దీపావళి నుంచి అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: వణికిస్తున్న బాంబు బెదిరింపులు.. ఎయిర్ లైన్స్‌కి ఎంత నష్టమంటే?

రెవెన్యూ సేవలకు ఒక సహాయకుడు..

ప్రతిగ్రామంలో భూముల రక్షణకు, రెవెన్యూ సేవలకు ఒక సహాయకుడు తప్పనిసరిగా ఉండాలని భావిస్తోంది. ఇందుకు వీఆర్‌ఏ లేదా అర్హులైన వారిని పరీక్ష ద్వారా ఎంపిక చేసి నియమించాలనే ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ధరణి పోర్టల్‌ స్థానంలో ‘భూ మాత’ పేరుతో పోర్టల్‌ ఏర్పాటు చేయనుంది. ధరణి పోర్టల్‌ను ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసీకి బదలాయింపు ప్రక్రియను ప్రభుత్వం ఇటీవల పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కాగా పేరు మార్చడమే మిగిలివుంది. ఇక నూతన చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించగానే పోర్టల్‌లో ఐచ్ఛికాలు ఇచ్చి రెవెన్యూ దస్త్రాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి: లిఫ్ట్ లో నాగచైతన్య, శోభిత ఏం చేశారో చూడండి! వైరలవుతున్న చై ఇన్‌స్టా పోస్ట్

#telangana #diwali #CM Revanth
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe