లిఫ్ట్ లో నాగచైతన్య, శోభిత ఏం చేశారో చూడండి! వైరలవుతున్న చై ఇన్‌స్టా పోస్ట్

అక్కినేని నాగచైతన్య తన కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల కలిసి దిగిన స్పెషల్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''ఎవ్రిథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌'' అంటూ చై ఫొటోకు క్యాప్షన్ జోడించారు. ఇందులో శోభిత, చై బ్లాక్ కలర్ అవుట్ ఫిట్స్ లో ట్రెండీగా కనిపించారు.

New Update
sobhitha1

naga chaithanya- shobitha

Naga chaithanya- shobitha:టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య ఇటీవలే నటి శోభిత దూళిపాళ్లను నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ తర్వాత బయట  ఎక్కడా కూడా కనిపించిన ఈ జంట తాజాగా సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. లిఫ్ట్ లో ఇద్దరు కలిసి తీసుకున్న మిర్రర్ సెల్ఫీని చైతన్య షేర్ చేస్తూ  ''ఎవ్రిథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌'' అంటూ క్యాప్షన్ జోడించారు. ఇందులో శోభిత, నాగచైతన్య ట్విన్నింగ్ అవుట్ ఫిట్స్ లో ట్రెండీగా కనిపించారు. గ్రే టీ షర్ట్ పై  బ్లాక్ లెదర్ జాకెట్‌లో చై కనిపించగా,  స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్‌తో పాటు భారీ బ్యాగీ జీన్స్‌ని శోభిత ధరించింది. 

shobitha

Also Read: మిస్ ఇండియా నిఖితకు ఆ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందట.. ?

సమంతతో విడాకులు 

గతంలో నాగచైతన్య నటి సమంతను వివాహం చేసుకున్నారు. 2017 లో పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ళ తర్వాత  2021లో పరస్పర అంగీకారంతో విడాకులు ప్రకటించారు. ఇక సమంతతో విడాకులైన మూడేళ్ళ తర్వాత.. ఈ ఏడాది ఆగస్టులో నాగచైతన్య నటి శోభిత దూళిపాళ్లను నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే నాగచైతన్య, శోభిత చాలా సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని చై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

Also Read: Married Couples : కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!

కొండా సురేఖ వివాదం 

ఇది ఇలా ఉంటే  ఇటీవలే  తెలంగాణ మంత్రి కొండా సురేఖ చైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణం అంటూ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను అక్కినేని కుటుంబం, సమంతతో సహా  పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ సైతం ఖండిస్తూ  కొండా సురేఖ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు