పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. అకిరా వచ్చేస్తున్నాడు

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ 'ఓజీ' మూవీతో ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలో పవన్ చిన్నప్పటి క్యారెక్టర్ లో అకీరా కనిపిస్తారట. కొద్ది రోజుల క్రితం అకిరా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అది 'OG' మూవీ కోసమే అని టాక్ వినిపిస్తోంది.

New Update
akira

పవన్ కళ్యాణ్ -సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న 'ఓజీ' మూవీపై ఫ్యాన్స్ తో పాటూ ఆడియన్స్ లోనూ విపరీతమైన హైప్ ఉంది. అటు మూవీ టీమ్ కూడా కాస్టింగ్ నుంచి స్టోరీ, పవన్ లుక్, బడ్జెట్.. ఇలా ప్రతీ యాస్పెక్ట్ బెస్ట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పునఃప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది.

Also Read : 'పుష్ప2' స్పెషల్ సాంగ్.. రంగంలోకి ప్రభాస్ హీరోయిన్

జూనియర్ పవన్ గా..

పవన్ కళ్యాణ్ నవంబర్ రెండో వారంలో షూటింగ్ లో జాయిన్ కానున్నారట. ఈ అప్డేట్ తో ఖుషీ అవుతున్న ఫ్యాన్స్ ను మరింత ఎక్సయిట్ చేసే  న్యూస్ ఒకటి బయటికొచ్చింది. పవన్ కళ్యాణ్ వారసుడు అకీరానందన్ 'ఓజీ' మూవీతో ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ చిన్నప్పటి క్యారెక్టర్ లో అకీరా కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం అకిరా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Also Read : హీరో కిచ్చా సుదీప్ ఇంట విషాదం.. పవన్ కళ్యాణ్ ట్వీట్

అయితే 'OG' మూవీ కోసమే అకిరా ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడని అంటున్నారు. సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. దీంతో నిజంగానే అకిరా ఈ సినిమాలో కనిపిస్తాడని ఫ్యాన్స్ గట్టిగానే నమ్ముతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. 

Also Read : లిఫ్ట్ లో నాగచైతన్య, శోభిత ఏం చేశారో చూడండి! వైరలవుతున్న చై ఇన్‌స్టా పోస్ట్

ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్ గా చేస్తున్నారు. హీరోయిన్ గా ప్రియాంకా మోహన్ నటిస్తోంది. సలార్ భామ శ్రియారెడ్డి, తమిళ్ స్టార్ అర్జున్ దాస్ సైతం కీలక పాత్రలు పోషిస్తున్నారు. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్

#pawan-kalyan #akira-nandan #og
Advertisment
Advertisment
తాజా కథనాలు