/rtv/media/media_files/2024/10/20/i1Zapj0zsSuuVgUB1QNk.jpg)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2' కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది.'పుష్ప 2' పార్ట్-1 కు 10 రెట్లు ఉంటుందని మూవీ టీమ్ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. అటు కాస్టింగ్ విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు.
Also Read : హీరో కిచ్చా సుదీప్ ఇంట విషాదం.. పవన్ కళ్యాణ్ ట్వీట్
తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నారట సుకుమార్. 'పుష్ప పార్ట్ -1' లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 'ఊ అంటావా మావా' అంటూ సామ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ సాంగ్ తో సమంత కు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చింది. ఇప్పుడు పార్ట్-2 లో అంతకుమించి ప్లాన్ చేశారట.
Also Read : లిఫ్ట్ లో నాగచైతన్య, శోభిత ఏం చేశారో చూడండి! వైరలవుతున్న చై ఇన్‌స్టా పోస్ట్
సుక్కు ప్లాన్ అదిరింది..
తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ 'పుష్ప 2' స్పెషల్ సాంగ్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. 'స్త్రీ 2' మూవీతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోడానికే సుకుమార్ ఆమెతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 'పుష్ప 2' కి శ్రద్ధా కపూర్ తోడైతే నార్త్ లో కలెక్షన్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే మేకర్స్ శ్రద్ధా కపూర్ ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం.
#Pushpa2ThRule Shooting Wrapped in a few days
— MJ Cartels (@Mjcartels) October 20, 2024
- #ShraddhaKapoor finalized for Special Song
- After #Stree2 Industry Hit She's Doing this Mega Song
- #AlluArjun Moves will be next level #RashmikaMandanna #Sukumar #FahadhFaasil #Bollywood https://t.co/Zbj5ifiZhj pic.twitter.com/P11tvUO1M7
Also Read : సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్
త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. డిసెంబర్ 6 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read : 46 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అంటున్న బ్యూటీ