/rtv/media/media_files/2025/10/14/komatireddy-vs-revanth-reddy-2025-10-14-18-24-56.jpg)
మునుగోడులో వైన్స్ షాప్ లకు కొత్త రూల్స్(Wine Shops New Rules) ప్రకటించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి(komatireddy-rajagopal-reddy) పై ఎక్సైజ్ శాఖ సీరియస్ అయ్యింది. మద్యం అమ్మకాలు, వైన్ షాప్ టెండర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మునుగోడులో వైన్ షాపులకు టెండర్లపై ఇటీవల రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. రాష్ట్రం మొత్తం ఎక్సైజ్ పాలసీ ఎలా ఉన్నా.. మునుగోడులో మాత్రం తాను చెప్పినట్లే టెండర్లు దక్కించుకున్న వారు వ్యవహరించాలని రాజగోపాల్ రెడ్డి ఇటీవల ప్రకటన చేశారు.
కేవలం స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలన్నారు. ఇంకా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు చేయాల్సి ఉంటుందన్నారు. బెల్టు షాపులకు మద్యాన్ని విక్రయిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఊరికి దూరంగా దుకాణాలు ఉండాలని.. పర్మిట్ రూమ్ లను ఏర్పాటు చేయొద్దని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పోస్టర్లు, రాజగోపాల్ రెడ్డి వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : కాంగ్రెస్‌లో రెడ్డిలదే లాబీయింగ్.. కొండా సురేఖ మరో సంచలనం
Revanth Vs Rajagopal
మునుగోడులో వైన్ షాపులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 14, 2025
ఊరి బయటే ఉండాలి.. సాయంత్రం 4-9 గంటల్లోపే విక్రయించాలని ఆదేశాలు
సిట్టింగ్ నడపకూడదుని.. బెల్ట్ షాపులకు కూడా మద్యం విక్రయించొద్దన్న ఎమ్మెల్యే
సాధారణ ప్రజలను ఇబ్బంది పెడితే.. తాను ఊరుకోనంటూ… pic.twitter.com/pQQkyWo3dX
Also Read : కేసీఆర్ కు కవిత బిగ్ షాక్.. అక్టోబర్ చివరి వారంలో యాత్ర
ఇప్పటికే రాష్ట్రంలో ఈ సారి తక్కువ దరఖాస్తులు నమోదవుతున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా మారాయి. రాష్ట్రం అంతా ఒకే ఎక్సైజ్ పాలసీ అమల్లో ఉండగా.. ఇప్పుడు మునుగోడులో కొత్త రూల్స్ ఎలా పెడుతారన్న అంశంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో టెండర్లు దాఖలు చేయడానికి వ్యాపారులు భయపడుతున్న సమయంలో ఎక్సైజ్ శాఖ ఈ ప్రకటన చేసింది.
2009లో కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీగా పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తనదైన దూకుడు శైలితో తెలంగాణ పాలిటిక్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా.. ఆ వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. అనంతరం మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 2018లో విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీతోనే కేసీఆర్ ను ఓడించడం సాధ్యమంటూ ఆ పార్టీలో చేరారు. ఈ క్రమంలో నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు.
హోరాహోరీగా సాగిన ఆ ఉప ఎన్నికలో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఖర్చు జరిగిన నియోజకవర్గంగా మునుగోడు నిలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు రాజగోపాల్ రెడ్డి. ఆ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించడంతో పాటు కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడంతో ఆయన మంత్రి పదవిని ఆశించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా తనకు హామీ ఇచ్చిందని ఆయన చెబుతున్నారు. అయితే.. విస్తరణలోనూ మంత్రి పదవి దక్కకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రేవంత్ కు పంటి కింద రాయిలా మారారు రాజగోపాల్ రెడ్డి.