మరోసారి మంత్రి కొండా సురేఖ(konda-surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని..కొంతమంది రెడ్డిలు లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆమె హన్మకొండ జిల్లాలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. మంత్రిగా తాను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటున్నారని అన్నారు. అందుకే మౌనంగా తన పనులు తాను చేయాలనుకుంటున్నానని తెలిపారు.ఎవరినో ఏదో చేయడానికి ఢిల్లీ, హైదరాబాద్‌లో లాబీయింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఏది ఉన్నా పార్టీ అధిష్ఠానానికే నేరుగా చెప్పి రాజకీయాలు చేస్తానని అన్నారు. ఎవరు ఏమనుకున్నా మంత్రిగా తన బాధ్యతలు తనకు తెలుసునన్నారు.
Also Read : నీ ఇష్టం నడవదు.. రాజగోపాల్ రెడ్డిపై ఎక్సైజ్ శాఖ సీరియస్!
Also Read : తుమ్ముల, పొన్నం అసలు మీరు మనుషులేనా.. హీటెక్కిన జూబ్లీహిల్స్ ఫైట్!
ఒపెన్‌గా మాట్లాడటం నాకు అలవాటు
పనులు వేగంగా జరగాలన్నదే తనది, సీఎం రేవంత్ ఆలోచన అని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ప్రతి విషయం ఒపెన్‌గా మాట్లాడటం తనకు అలవాటు అని చెప్పుకొచ్చారు. మేడారం టెండర్ల విషయంలో తనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవన్నారు సురేఖ. మూడు కంపెనీలు టెండర్లు వేశాయని, అందులో ఎవరి ఎలిజిబులిటీ వారిదని తెలిపారు. ఇక నటుడు నాగార్జున విషయంలో తాను మాట్లాడింది వేరని... కానీ దాన్ని మరోలాగా చిత్రీకరించారని చెప్పుకొచ్చారు. అందుకే మీడియాతో తాను ఓపెన్‌గా ఉండటం లేదని, మౌనంగా తన శాఖ పనులు చేసుకుంటున్నానని వెల్లడించారు.
Konda Surekha : కాంగ్రెస్‌లో రెడ్డిలదే లాబీయింగ్.. కొండా సురేఖ మరో సంచలనం
మరోసారి మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని..కొంతమంది రెడ్డిలు లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆమె హన్మకొండ జిల్లాలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు.