Kavitha : కేసీఆర్ కు కవిత బిగ్ షాక్.. అక్టోబర్ చివరి వారంలో యాత్ర

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేయాలని కవిత నిర్ణయించారు. అక్టోబర్ చివరి వారంలో యాత్ర ప్రారంభం కానుందని తెలుస్తోంది.

New Update
kavitha

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(mlc kavitha) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేయాలని కవిత నిర్ణయించారు. అక్టోబర్ చివరి వారంలో యాత్ర ప్రారంభం కానుందని తెలుస్తోంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల మీదుగా కవిత యాత్ర సాగనుందని సమాచారం. ఈ యాత్రను కవిత తాను అధ్యక్షత వహిస్తున్న సాంస్కృతిక సంస్థ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత యాత్ర సాగనుందని తెలుస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో యాత్ర పోస్టర్లకు ప్లాన్ చేసినట్లుగా సమాచారం. బీసీ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈ యాత్రకు ప్లాన్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది. 

Also Read :  తుమ్ముల, పొన్నం అసలు మీరు మనుషులేనా.. హీటెక్కిన జూబ్లీహిల్స్ ఫైట్!

ఫిబ్రవరి వరకు కవిత యాత్ర

రేపు యాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల కానుంది.ఫిబ్రవరి వరకు కవిత యాత్ర సాగనుంది. మేధావులు, విద్యావంతులో కవిత సమావేశాలు నిర్వహిస్తున్నారు.   కాగా అంతర్గత విమర్శలు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్(BRS Party) అధినేత కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ జరిగిన మరుసటి రోజు ఆమె బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆమె చేపట్టనున్న యాత్ర రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు కాగా, గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలంటూ, జాబ్ క్యాలెండ‌ర్‌ను ప్రకటించాలంటూ హైదరాబాద్‌లోని చిక్కడ‌ప‌ల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను కవిత కలిశారు. అక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో బైఠాయించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.

Also Read :  జూబ్లీహిల్స్ లో ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నారు.. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సెటైర్లు!

Advertisment
తాజా కథనాలు