daku maharaj OTT update
Daaku Maharaaj: బాలయ్య- బాబీ కాంబోలో విడుదలైన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'డాకు మహారాజ్'. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. 8 రోజుల్లోనే రూ. 156కి పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పటికీ థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ తో రాణిస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత డాకు మహారాజ్ తో మరో హిట్టు కొట్టి హ్యాట్రిక్ బ్రేక్ చేశారు బాలయ్య.
Also Read: Balayya Padma Bhushan: జై బాలయ్య.. పద్మ భూషణ్ వేళ అభిమానికి బాలయ్య ఫోన్ కాల్ .. పోస్ట్ వైరల్
The KING OF SANKRANTHI roars louder with every passing day 🪓🔥#DaakuMaharaaj storms past 𝟏𝟓𝟔+ 𝐂𝐫𝐨𝐫𝐞𝐬 Gross Worldwide in 8 DAYS 💥
— Sithara Entertainments (@SitharaEnts) January 20, 2025
Celebrate the unstoppable reign of 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna in cinemas near you ❤️🔥… pic.twitter.com/hHvfs5Ac28
Also Read: Kannappa: డార్లింగ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. కన్నప్పలో నుంచి ప్రభాస్ పోస్టర్ గ్లిమ్ప్స్ !
డాకు మహారాజ్ ఓటీటీ అప్డేట్
ఈ క్రమంలో డాకు మహారాజ్ ఓటీటీ అప్డేట్ పై నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. డాకు మహారాజ్డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రూ. 25పైగా వెచ్చించినట్లు సమాచారం. ఫిబ్రవరి 9నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేందుకు నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అయితే స్ట్రీమింగ్ డేట్ పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించగా, బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో ఆకట్టుకుంది.
Also Read: Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?