/rtv/media/media_files/2025/07/08/unni-mukundan-instagram-account-hacked-2025-07-08-14-38-15.jpg)
Unni Mukundan Instagram account hacked
Cinema: మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఫేస్‌బుక్ ద్వారా అభిమానులకు తెలిపారు. "ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ (@iamunnimukundan) నుంచి ఏవైనా పోస్టులు, డైరెక్ట్ మెసేజ్‌లు లేదా స్టోరీలు వస్తే అవి తాను పెట్టినవి కావని, హ్యాకర్లు పెడుతున్నవని ఉన్ని ముకుందన్ స్పష్టం చేశారు. అలాంటి వాటిని చూసి మోసపోవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని" తన అభిమానులను కోరారు. అలాగే తన అకౌంట్ తిరిగి నియంత్రణలోకి తీసుకురావడానికి టెక్ నిపుణులతో కలిసి పనిచేస్తున్నాని తెలిపారు. సమస్య పరిష్కారం అయిన వెంటనే తానే స్వయంగా అభిమానులకు తెలియజేస్తానని చెప్పారు.
🚨 IMPORTANT ANNOUNCEMENT 🚨 My official Instagram account @iamunnimukundan has been hacked. ‼️ Any updates, DMs,...
Posted by Unni Mukundan on Monday, July 7, 2025
Also Read : పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ.. అసీమ్ మునీర్ తిరుగుబాటు
'మార్కో' తో భారీ విజయం
'యశోద', 'జనతా గ్యారేజ్', 'ఖిలాడీ', వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉన్ని ముకుందన్. ఇటీవల విడుదలైన 'మార్కో' తో మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టినప్పటికీ.. ఇందులోని అధిక హింసపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో 'మార్క్' తీయాలనుకునే సీక్వెల్ ఆలోచన మానుకున్నారు మేకర్స్. అయితే ముందుగా 'మార్కో' పార్ట్ 2 కూడా ఉంటుందని ప్రకటించారు. కానీ సినిమాపై నెగెటివిటీ ఎక్కువవడంతో సీక్వెల్ తీసే ఆలోచన లేదని అధికారికంగా ప్రకటించారు.
Also Read : Chat GPT: 10 ఏళ్లుగా డాక్టర్లు గుర్తించని వ్యాధి.. క్షణాల్లో గుర్తించిన చాట్‌జీపీటీ
/filters:format(webp)/rtv/media/media_files/2025/06/15/wTxmVc0KFF1F5l6pqU9p.jpg)
ప్రస్తుతం ఉన్ని ముకుందన్ 'గంధర్వ జూనియర్' అనే పాన్-ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. విష్ణు అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇది కాకుండా, తెలుగులో కూడా కొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు ఉన్ని ముకుందన్. తన సొంత బ్యానర్ 'ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్' బ్యానర్ పై మార్కో, జై గణేష్, మెప్పడియన్ సినిమాలను నిర్మించారు.
Also Read:Kingdom Release Date: మాస్ మమ మాస్.. దేవరకొండ ‘కింగ్‌డమ్’ రిలీజ్ ప్రోమో సూపరెహే
cinema-news | telugu-news