పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయి. ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ తిరుగుబాటు మొదలుపెట్టారు. ఏకంగా అధ్యక్ష పదవిపైనే కన్నేశారు. ప్రస్తుత అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీని గద్దె దించేందుకు మునీర్ అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసీమ్ మునీర్ తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకోబోతున్నట్లు కూడా సమాచారం. ఇటీవల ఆయన ట్రంప్‌తో సమావేశం అయిన సంగతి తెలిసిందే.
Also Read: ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. నుజ్జునుజ్జైన బస్సు
అప్పటినుంచి పాకిస్థాన్‌లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఒకవేళ అసీమ్ మునీర్ దేశ అధ్యక్షుడైతే భారత్‌కు కష్టకాలం ఉంటుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మునీర్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి భారత్‌తో పాటు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ పహల్గాం ఉగ్రదాడికి కూడా అసీమ్ మునీరే కారణమని ఆరోపణలు కూడా ఉన్నాయి.