Speaker: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. స్పీకర్ సంచలన నిర్ణయం.. ఆ 8 మంది MLAలు సేఫ్?

తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వగా 8 మంది సమాధానం ఇచ్చారు. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని.. తాము కప్పుకున్నది అసలు కాంగ్రెస్ కండువానే కాదన్నారు.

New Update
Telangana Defemation MLAs

తెలంగాణ(Telangana) లో ఫిరాయింపు వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్పీకర్‌ నోటీసులకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానంపై ఇంట్రెస్టింగ్  చర్చ సాగుతోంది. స్పీకర్ దానం నాగేందర్, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, డా.సంజయ్, తెల్లం వెంకట్రావు, కృష్ణ మోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే.. ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ నోటీసులకు సమాధానం ఇచ్చారు. అభివృద్ధి  పనుల కోసమే సీఎంను కలిశామని స్పష్టం చేశారు. సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పితే తిరస్కరించడం కరెక్టు కాదనే కప్పుకున్నామని వివరణ ఇచ్చారు. తాము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదన్నారు. అది మూడు రంగుల కండువా అని వివరించారు.

Also Read :  గుడ్‌న్యూస్.. ఇక నుంచి క్యాస్ట్ ఇన్‌కమ్ సులభంగా పొందచ్చు

కడియం, దానం పరిస్థితి ఏంటి?

మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి(Kadiyam Srihari), దానం నాగేందర్(Danam Nagender) స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. తమకు మరింత సమయం కావాలని వారు కోరారు. అయితే.. 8 మంది ఎమ్మెల్యేల వివరణను బీఆర్ఎస్‌ నేతలకు అసెంబ్లీ కార్యదర్శి పంపించారు. ఎమ్మెల్యేల వివరణపై సమాధానం ఇవ్వాలని వివేకానంద, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, జగదీశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్‌ అసెంబ్లీ కార్యదర్శి పంపించారు. 3 రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలని బీఆర్ఎస్‌కు స్పీకర్ ప్రసాద్ కుమార్ గడువు విధించారు. సుప్రీం కోర్టు గడువు ముగుస్తుండటంతో ఈ నెల 13లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. 

Also Read :  తెలంగాణలో కుప్పకూలిన కలెక్టరేట్‌ బిల్డింగ్.. అందులోనే మంత్రి, అధికారులు

2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) నుంచి 39 మంది, కాంగ్రెస్ నుంచి 64 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా సికింద్రబాద్ కాంగ్రెస్ ఎంపీగా అభ్యర్థిగా పోటీ కూడా చేశారు. దీంతో వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జులైలో కీలక తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ వారికి నోటీసులు ఇచ్చారు. 

ఇదిలా ఉంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై రాష్ట్ర మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు. నూత‌న రాష్ట్రంలో ఫిరాయింపు రాజ‌కీయాల‌కు ఆజ్యం పోసిందే కేసీఆర్ అని ధ్వజమెత్తారు. ఫిరాయింపు సంస్కృతికి పితామ‌హుడు కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు. ప‌రాయి పార్టీల్లో గెలిచిన తల‌సాని, స‌బితా ఇంద్రారెడ్డిని మంత్రులుగా ప్ర‌మాణం చేయించిన చ‌రిత్ర బీఆర్ఎస్ దని ఆరోపించారు. నాడు పార్టీలు మారిన ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయించారా? అని బీఆర్ఎస్ నేతలను సీతక్క ప్రశ్నించారు. పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి మాట్లాడితే మంచిదన్నారు. నాడు రాజ్యంగాన్ని ఉల్ల‌ఘించిన మీకు రాజ్యంగ ధ‌ర్మాస‌నాన్ని ఆశ్ర‌యించే నైతిక హ‌క్కు లేదని అన్నారు సీతక్క. 

Advertisment
తాజా కథనాలు