Cat: తెలంగాణలో వింత ఘటన: పిల్లి గోల పోలీస్టేషన్‌కు.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌కి పంపిన పోలీసులు!

తెలంగాణలోని నల్గొండలో వింత ఘటన చోటుచేసుకుంది. గతేడాది తప్పిపోయిన తన పిల్లి పక్కింట్లో ఉందని ఓ మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన పిల్లి తెల్లగా ఉంటుందని, దానికి బ్రౌన్ కలర్ వేశారని తెలిపింది. పోలీసులు ఈ సమస్య తేల్చలేక ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

New Update
Nalgonda Woman Files Police Complaint Over Cat missing.

Nalgonda Woman Files Police Complaint Over Cat missing

కొన్ని సంఘటనలు నమ్మడానికి కాస్త వింతగా అనిపిస్తాయి. అవునా.. నిజమా.. అలా జరిగిందా? అని డౌట్ పడేంతలా ఉంటాయ్. తాజాగా అలాంటి ఓ వింత సంఘటనే తెలంగాణ (Telangana) లో జరిగింది. సాధారణంగా కోడి కొట్లాట కోర్టు వరకు వెళ్లడం చూశాం. కానీ పిల్లి కొట్లాట పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఎప్పుడైనా చూశారా..?. అవును మీరు విన్నది నిజమే. 

ఇది కూడా చూడండి: దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?

నల్గొండ జిల్లా కేంద్రంలో పిల్లి కోసం ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. ఆ పిల్లి (Cat) నాది అంటే.. కాదు నాది అంటూ చివరికి పోలీస్టేషన్‌ మెట్లు ఎక్కారు. ఇక పెంచిన వారే గుర్తు పట్టలేకపోతే.. పోలీసులు ఎలా గుర్తుపట్టగలరు. దీంతో వారు కూడా చేతులెత్తేశారు. తమవల్ల కాదని.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇప్పుడు ఆ రిపోర్ట్ కోసం చూస్తున్నారు. దాని వివరాలు రాగానే..ఆ పిల్లి ఎవరిది అనేది పోలీసులు తేల్చనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ పిల్లి నాది

నల్లగొండ (Nalgonda) కు చెందిన పుష్పలత అనే మహిళ ఒక తెల్లటి పిల్లిని దాదాపు 3 ఏళ్లకు పైగా పెంచుకుంటుంది. అది కాస్తా గతేడాది కనిపించకుండా పోయింది. అయితే అలాంటి తెల్లటి పిల్లి, అచ్చం అవే లక్షణాలతో ఆమె తన పక్కింట్లో ఉండటం చూసింది. దీంతో ఆ పిల్లి తనదే అని పక్కింటి వాళ్లతో గొడవ పడింది. 

ఇది కూడా చూడండి: Telangana: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..మొదటి పెళ్లి రద్దుకాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే

చేతులెత్తేసిన పోలీసులు

అక్కడితో ఆగకుండా వెళ్లి నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో ఇద్దరిని పిలిపించిన పోలీసులు వారిని ప్రశ్నించారు. పుష్పలతేమో.. ఆ పిల్లి తనదని.. తన పిల్లి వైట్ కలర్‌లో ఉండేదని, ఇప్పుడు దానికి బ్రౌన్ కలర్ రంగు వేశారని తెలిపింది. అయితే పక్కింటి వ్యక్తి కూడా ఆ పిల్లి తనదే అంటూ గట్టిగా మాట్లాడాడు. దీంతో వారి సమస్యను పోలీసులు సైతం తేల్చలేకపోయారు. ఇది ఇలా తెగేది కాదని.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. దానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లి ఎవరిది అనేది తెలుస్తుంది.

ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్‌ గ్యాప్‌ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?

Advertisment
తాజా కథనాలు