Prabhas Fauji: డార్లింగ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. ప్రభాస్ తో సాయి పల్లవి..! SRK సినిమాలోని ఆ పాత్ర వలే

ప్రభాస్ 'ఫౌజీ' కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దర్శకుడు హను రాఘవపూడి సాయి పల్లవిని సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జోరుగా నడుస్తోంది. SRK 'వీర్-జారా' లోని రాణి ముఖర్జీ పాత్ర వలే పల్లవి పాత్ర ఉండబోతున్నట్లు టాక్. 

New Update
fauji

Prabhas Fauji Updates

Prabhas Fauji:  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి  'ఫౌజీ'. హను రాఘవపూడి దర్శకత్వంలో 1940 కాలం నాటి కథాంశంతో  రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతోంది. ప్రేమ కథ, గుండెకు హత్తుకునేలా డ్రామా, భారీ యాక్షన్ సీన్స్ తో హను రాఘవపూడి తనదైన శైలిలో   తెరకెక్కిస్తున్నారు.  ఇందులో ప్రభాస్ లుక్ లుక్ మునుపటి పాత్రల కంటే బిన్నంగా ఉండబోతుంది. ఇది ఇలా ఉంటే.. మరోవైపు ప్రభాస్ జోడిగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్వి అరంగేట్రం చేయడం చిత్రానికి మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. 

Also Read: మంచు బ్రదర్స్ మధ్య వార్.. 'తల నరికి నీ భార్య చేతిలో పెడతా' అంటూ మనోజ్ ఫైర్

కీలక పాత్రలో సాయి పల్లవి.. 

ఈ ఉత్సాహానికి తోడు  'ఫౌజీ' సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమూవీలో నటి సాయి పల్లవి కూడా జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి సాయి పల్లవిని సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇదే జరిగితే 'పడి పడి లేచే మనసు' తర్వాత సాయి పల్లవి- హను రాఘవపూడి కాంబో మరోసారి తెరపైకి రానుంది. 

Also Read:కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!

ఆ పాత్ర వలే 

అయితే హను రాఘవపూడి ప్రభాస్ 'ఫౌజీ' విషయంలో  షారుక్ ఖాన్ వీర్-జారా సినిమా నుంచి ఎక్కువగా ప్రేరణ పొందారట. ముఖ్యంగా SRK తన ప్రేమ కోసం ఖైదీగా మారే కథాంశం నుంచి ప్రేరణ పొందారని నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా  'ఫౌజీ' లో ప్రభాస్ పాత్ర కూడా తన ప్రేమను కాపాడుకోవడానికి ఖైదీగా మారుతుందని టాక్.  అయితే  వీర్ జారాలో  SRK కేసు కోసం పోరాడిన న్యాయవాది రాణి ముఖర్జీ పాత్ర వలే..  ఫౌజీలో సాయి పల్లవి పాత్ర ఉండబోతున్నట్లు  తెలుస్తోంది. 

Also Read:పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!

Also Read:అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్‌.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం

Advertisment
తాజా కథనాలు