Telangana: రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ హవా.. ఒక్క ఓటుతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతోంది. రాత్రి 8 గంటలకు వెల్లడైన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థులకు 1705కు పైగా, బీఆర్‌ఎస్‌ మద్దతు అభ్యర్థులకు 889కి పైగా బీజేపీకి 197, ఇతరులు 475కు పైగా స్థానాల్లో గెలిచారు.

New Update
telangana local body elections counting updates

telangana local body elections counting updates

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నిక(local-body-elections)ల కౌంటింగ్‌ జరుగుతోంది. ఆదివారం 193 మండలాల్లో 3911 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, 29917 వార్డు సభ్యులకు పోలింగ్ నిర్వహించారు. రాత్రి 8 గంటలకు వెల్లడైన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థులకు 1705కు పైగా, బీఆర్‌ఎస్‌ మద్దతు అభ్యర్థులకు  889కి పైగా బీజేపీకి 197, ఇతరులు 475కు పైగా స్థానాల్లో గెలిచారు. ఇదిలాఉండగా తొలిదశలో 4236 గ్రామాల్లో 2334 కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌గా గెలిచారు. బీఆర్ఎస్ 1169, బీజేపీ189, ఇతరులు 538 మంది గెలిచారు. 

Also Read :  రెండో విడత కౌంటింగ్‌లో దూసుకుపోతున్న కాంగ్రెస్

ఒక్క ఓటుతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు 

నల్గొండ
నల్గొండ జిల్లా  దామరచర్ల మండలం గణేశ్‌పాడులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రమేశ్‌ నాయక్ ఒక్క ఓటు తేడాతో గెలిచారు. కాంగ్రెస్ మద్దతుదారుపై ఆయన విజయం సాధించారు. అదే జిల్లాలో ఇసుకబావిగూడెం సర్పంచ్‌గా కల్లూరి అనిత కూడా ఒక్క ఓటుతో గెలిచారు. 
రంగారెడ్డి
చేవేళ్ల మండలం గుండాలలో బుచ్చిరెడ్డి అనే అభ్యర్థి ఒక్క ఓటుతో సర్పంచ్‌గా గెలిచాడు. బీఆర్‌ఎస్‌ మద్దతుదారు కాంత్‌రెడ్డిపై ఒక్క ఓటుతో గెలిచాడు. 
వికారాబాద్  
రాంపూర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారు రమాదేవి ఒక్క ఓటుతో గెలిచారు. 
కరీంనగర్‌
అంబాల్‌పూర్‌ సర్పంచ్‌గా వెంకటేశ్ అనే అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలిచారు
వరంగల్
సంగెం మండలం ఆశాలపెల్లి సర్పంచ్‌గా కొంగర మల్లమ్మ ఒక్క ఓటు మెజార్టీతో గెలిచింది. 

Also Read :  కేసీఆర్ సంచలన ప్రకటన.. ఇక ఉద్యమమే.. 19న కీలక మీటింగ్!

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ధర్మపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌంటింగ్ హాలు నుంచి గోడ దూకి బ్యాలెట్‌ పేపర్లు అపహరించినట్లు ఆరోపణలు రావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో కౌంటింగ్ కేంద్రం ఎదుట బీఆర్ఎస్, రెబల్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగే దాకా కౌంటింగ్ నిలిపివేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య స్వల్ప తేడా ఉండటంతో రెండుసార్లు అధికారులు లెక్కించారు. అయినప్పటికీ తేడా రావడంతో ఓ అభ్యర్థి వర్గం నిరసనకు దిగడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. 

ఇక సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం పిపడ్‌పల్లిలో ఇటీవల కాంగ్రెస్ మద్దతుదారుడైన సర్పంచ్‌ అభ్యర్థి చల్కి రాజు సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు జరిగిన ఓట్ల లెక్కింపులో రాజు 9 ఓట్ల తేడాతో సర్పంచ్‌గా గెలిచాడు. దీంతో అధికారులు ఆ గ్రామంలో మరోసారి ఎన్నికల నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు