Pulse Polio: తల్లిదండ్రులకు అలర్ట్: ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్స్ పోలియో కార్యక్రమం..

ఈనెల 21న తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా 5 ఏళ్లలోపు 54 లక్షలకు పైగా పిల్లలకు పోలియో చుక్కలు ఇవ్వడం కోసం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బూత్‌లు, ఇంటింటికీ వెళ్లే మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ బృందాలతో పిల్లలకు తగిన డోసులు అందజేయనున్నారు.

New Update
Pulse Polio

Pulse Polio

Pulse Polio: ఈనెల 21న తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లలోపు 54 లక్షలకు పైగా పిల్లలకు పోలియో చుక్కలు ఇవ్వడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తారని తెలిపారు.

మంత్రివర్యులు తెలిపిన వివరాల ప్రకారం, 38,267 బూత్‌లలో 5 ఏళ్లలోపు పిల్లలకు 61,26,120 డోసులు ఇప్పటికే పంపిణీ అయ్యాయి.
డిసెంబరు 21న బూత్‌ల వద్ద పిల్లలకు పోలియో చుక్కలు అందజేయడం జరుగుతుంది. పలు కారణాల వల్ల చుక్కలు తీసుకోలేని పిల్లలకు 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మరల అందజేయడం జరుగుతుంది. ఈ పని కోసం 76,534 బృందాలు రంగంలో ఉంటాయి.

పోలియో రోగాన్ని పునరావృతం కాకుండా చూసుకోవడం కోసం రాష్ట్రాలకు కేంద్రం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. 1,704 మెడికల్ అధికారులు, 39,494 ఇతర సిబ్బంది, ఫార్మాసిస్టులు, నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అలాగే 4,206 పర్యవేక్షకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

రాష్ట్రంలో 1854 మొబైల్ బృందాలు తిరుగుతూ, ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తాయి. ప్రతి బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్ ఇద్దరు సహాయకులు ఉంటారు. ఇంట్లో ఉన్న పిల్లలకు చుక్కలు ఇచ్చినట్లయితే “P” గుర్తు, మిస్సైన పిల్లలకు “X” గుర్తు వేసే విధానం ఉంటుంది.

అలాగే, అన్ని ట్రాన్సిట్ పాయింట్లు బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన ఆస్పత్రులు, మేళాలు, బజార్లు వంటి ప్రదేశాల్లో 21-23 డిసెంబర్ వరకు ట్రాన్సిట్ బృందాలు పర్యవేక్షిస్తాయి. ప్రత్యేకించి స్లమ్ ప్రాంతాలు, నిర్మాణ స్థలాలు, వలస ప్రాంతాలు, సంచార జాతుల ప్రాంతాలను కవర్ చేయడానికి 1854 మొబైల్ బృందాలు, 1,140 ట్రాన్సిట్ బూత్‌లు ఏర్పాట్లు చేశారు. ప్రతి తల్లి, తండ్రి తమ 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పకుండా అందించాలని మంత్రివర్యుల సూచించారు.

Advertisment
తాజా కథనాలు