Crime News: ఫోన్ చూడొద్దన్నందుకు.. పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య!

ఫోన్ చూడొద్దన్నందుకు పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో జరిగింది. 16ఏళ్ల బాలిక స్టడీ మెటీరియల్ జిరాక్స్ కోసం ఫోన్ అడిగింది. దానికి ఆమె తల్లి నో చెప్పడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

New Update
ap crime news

Telangana Kumuram Bheem Kautala mandal 10th class student suicide

ఫోన్ చూడొద్దమ్మ అని తల్లి మందలించినందుకు పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కుమురం భీం జిల్లా కౌటాల మండల కేంద్రానికి చెందిన 16 ఏళ్ల బాలిక ప్రైవేట్ స్కూల్లో పదోతరగతి చదువుతోంది. 

Also Read: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?

అయితే కాగజ్‌నగర్ పట్టణంలో శనివారం నవోదయ ప్రవేశపరీక్షకు హాజరైంది. అనంతరం మధ్యాహ్నం ఇంటికి వచ్చి స్కూల్‌కి వెళ్లింది. ఇక అక్కడ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఆ సమయంలోనే తనకు ఫోన్ కావాలని తల్లిని అడిగింది. స్టడీ మెటీరియల్ పీడీఎఫ్ జిరాక్స్ తీసుకుంటానని.. తనకు ఫోన్ కావాలని అడిగింది. 

Also Read:ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!

మనస్తాపంతో షాకింగ్ డెసిషన్

కానీ ఆ బాలిక తల్లి మాత్రం ఫోన్ ఇవ్వలేదు. తానే జిరాక్స్ తీసుకొస్తానని చెప్పి.. ఫోన్ పట్టుకుని జిరాక్స్ సెంటర్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే ఫోన్ అడిగితే ఇవ్వలేదన్న మనస్తాపంతో ఆ బాలిక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఎప్పుడైతే తన తల్లి బయటకు వెళ్లిందో ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇక జిరాక్స్ కోసం వెళ్లిన ఆ బాలిక తల్లి ఇంటికొచ్చి చూసే సరికి వేలాడుతూ కనిపించింది.

Also Read:డాంకీ రూట్‌ లో అమెరికా వెళ్తూ..పంజాబ్‌ యువకుడి మృతి!

దీంతో కన్నీరు పెట్టుకుని సమాచారాన్ని భర్తకు తెలియజేసింది. ఇంటికి చేరుకున్న ఆ భర్త తన కూతురిని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో ఆ బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దంపతుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్‌ డేవిల్‌ హంట్‌..1300 మంది అరెస్ట్‌!

Advertisment
తాజా కథనాలు