/rtv/media/media_files/2025/10/13/jubileehills-bjp-2025-10-13-18-18-23.jpg)
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. గతంలో హైదరాబాద్ లో చక్రం తిప్పిన ముఖేష్ గౌడ్ చరిష్మా విక్రమ్ కు కలిసి వస్తుందని కమలం పార్టీ లెక్కలు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర పార్టీ నేతలతో విక్రమ్ గౌడ్ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు విక్రమ్ బీజేపీలోనే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. దీంతో ఆయనను పార్టీలోకి తీసుకువచ్చి టికెట్ ఇవ్వాలన్నది ముఖ్య నేతల ఆలోచనగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్(by election in jubilee hills 2025) అభ్యర్థిని నిన్న రాత్రే బీజేపీ ఖరారు చేస్తోందని అంతా భావించారు.
ఇందు కోసం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కూడా ఢిల్లీలో ఉన్నారు. నిన్న రాత్రి కూడా పేరును హైకమాండ్ ఫైనల్ చేయలేకపోయింది. దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి పేర్లు షార్ట్ లిస్ట్ చేయగా.. దీపక్ రెడ్డి వైపే హైకమాండ్ మొగ్గు చూపినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే కాంగ్రెస్ బీసీ అభ్యర్థి నవీన్ యదవ్ పేరును ఖరారు చేయడంతో బీజేపీ కూడా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.
Also Read : జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఊహించని షాక్.. 300 మంది మాలల నామినేషన్లు!
Jubileehills By Elections 2025
ఇందులో భాగంగానే విక్రమ్ గౌడ్ పేరును పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బలమైన గౌడ సామాజికవర్గం కావడంతో పాటు తండ్రి బ్యాగ్రౌండ్ ఆయనకు కలిసివస్తుందని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్ వైఎస్ హయాంలో మంత్రిగా పని చేశారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన చరిత్ర ఆయనది. అయితే.. గత కొన్ని రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబంపై బీసీ వర్గాల్లో సానుభూతి కూడా ఉంది. ఇది కూడా తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. ఈ రోజు రాత్రి లేదా రేపటి లోగా అభ్యర్థి పేరును బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది.
Also Read : నేనేంటో అందరికీ తెలుసు.. కొండా సురేఖతో విభేదాలపై పొంగులేటి సంచలన కామెంట్స్!