/rtv/media/media_files/2025/07/18/jagtial-father-killed-young-man-for-allegedly-harassing-his-daughter-2025-07-18-08-09-48.jpg)
jagtial father killed young man for allegedly harassing his daughter
తెలంగాణలో దారుణం జరిగింది. తన కూతురిని వేధిస్తున్నాడని.. యువకుడిని ఓ తండ్రి హత్య చేయడం సంచలనంగా మారింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆ యువకుడి పేరు సల్లూరి మల్లేశ్(26). అతడిది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని కిషన్‌రావుపేట గ్రామం. గత కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన ఓ యువతి వెంట పడుతున్నాడు. అయితే ఆ యువతికి ఏమాత్రం నచ్చలేదు. ఎన్నిసార్లు చెప్పినా మల్లేశ్ వినిపించుకోలేదు. ఇక ఇదే విషయమై యువతి కుటుంబ సభ్యులు చాలా సార్లు హెచ్చరించారు.
కూతురిని వేధిస్తున్నాడని
అప్పటికీ వినకపోవడంతో ఆ యువతి పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడు మల్లేశ్ పై నాలుగు కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా మూడేళ్ల కిందట మల్లేశ్‌పై యువతి ఫ్యామిలీ దాడి చేసింది. దీంతో మల్లేశ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వగా.. యువతి తండ్రి రాజిరెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి:పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో
ఇందులో భాగంగానే మల్లేశ్ గురువారం ఆ యువతి ఇంటికి వెళ్లాడు. దీంతో ఆమె భయపడి.. తన తండ్రికి సమాచారం అందించింది. వెంటనే చిర్రెత్తిపోయిన యువతి తండ్రి మరో ఇద్దరితో కలిసి వెల్గటూరు పెద్దవాగు వంతెన సమీపంలో అందరూ చూస్తుండగానే మల్లేశ్‌పై దాడి చేశాడు. అనంతరం పోలీసులు వచ్చేలోపు పరారయ్యారు. ఆ తర్వాత కొద్ది సేపటికి మల్లేశ్ కోటిలింగాల రహదారిని ఆనుకుని ఉన్న పాత వైన్స్ వెనకాల కత్తిపోట్లతో గాయపడి విగతజీవిగా కనిపించాడు. దీంతో మల్లేశ్ తండ్రి రాజయ్య ఫిర్యాదుతో యువతి తండ్రి రాజిరెడ్డితోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: టీమిండియా క్రికెటర్ షమీ మాజీ భార్య, కూతురిపై క్రిమినల్ కేసు - షాకింగ్ వీడియో