/rtv/media/media_files/2025/01/30/pk8hbnASzGbFnCiQgOoh.jpg)
Telangana Inter hall ticket issuing difficulties
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్ల జారీలో అంతరాయం ఏర్పడింది. CGG పోర్టల్‌లో టెక్నికల్ సమస్య కారణంగా ఈ ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అంటూ గందరగోళంలో పడ్డారు. ఏ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన రిలీజ్ చేసింది.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్
లిస్ట్ సిద్ధం చేయండి
హాల్ టికెట్ లేకున్నా స్టూడెంట్స్‌ను పరీక్షలకు అనుమతించాలని తెలిపింది. ఈ మేరకు పరీక్ష ఫీజు చెల్లించిన వారి పేర్లు, చెల్లించని వారి పేర్ల లిస్ట్ సిద్ధం చేయాలని పేర్కొంది. అలాగే హాల్ టికెట్ రాని వారి లిస్ట్ సైతం సిద్ధం చేయాలని ఇంటర్ బోర్డు సిబ్బందిని ఆదేశించింది.
Also Read : నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్!
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు శుభవార్త చెప్పింది. ఇంతకు ముందు వరకూ కాలేజీకి వెళ్ళి ఇంటర్ హాల్ టికెట్లను తీసుకొచ్చేవారు. లేదా వెబ్ సైట్లో పెట్టి డౌన్ లోడ్ చేసుకోమని చెప్పేవారు. కానీ ఇప్పుడు హాల్ టికెట్లను విద్యార్థుల మొబైల్ నంబర్లకే పంపిస్తోంది బోర్డు. విద్యార్థులు ఇచ్చిన మొబైల్ ఫోన్ నంబర్లకు లింక్ పంపిస్తున్నారు. దాన్ని క్లిక్ చేస్తే హాల్‌టికెట్ వస్తుందని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారి ఒకరు తెలిపారు.
Also Read : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..
పరీక్షల సీజన్ మొదలు
మరోవైపు ఈరోజు నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యాయి. మొదట ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. తరువాత అసలు పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఇప్పటికే విద్యార్థుల మొబైల్ కు పంపించామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
Also Read : పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్ మామూలుగా లేదుగా!
ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు మొదలవనున్నాయి. వారికి కూడా త్వరలోనే హాల్ టికెట్లను పంపిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు.