/rtv/media/media_files/2024/11/29/DSS37P9CjoWGVADVcusv.jpg)
YCP Ex Minister Krishna das: వైసీపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పీఏ మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఏసీబీ అధికారుల మురళి నివాసంలో సోదాలు చేపట్టారు. 70 కోట్ల అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. 6 చోట్ల ఇళ్లులు, 7 చోట్ల ఫ్లాట్లు, 15,47 ఎకరాల పొలం, కిలో బంగారు ఆభరణాలు, 11,36 కిలోల వెండి ఆభరణాలు, 44 లక్షల నగదు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. 2019 నుంచి 2024 వరకూ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వద్ద పిఏగా మురళీ విధులు నిర్వహించాడు.