/rtv/media/media_files/2025/12/14/telangana-gram-panchayat-polls-2025-2025-12-14-14-46-28.jpg)
Telangana gram panchayat Polls-2025
తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నిక(local-body-elections)ల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవ్వగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. 1వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఓటువేసే అవకాశమిచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ముందుగా వార్టుల ఓట్లు లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు కౌంట్ చేయనున్నారు. ఇక సర్పంచ్ ఫలితాలు వచ్చిన తర్వాత ఉపసర్పంచ్ ఎన్నికను నిర్వహించనున్నారు.
Also Read: కమ్యూనిస్టుల కంచు కోట బద్దలు.. కేరళ లోకల్ ఎలక్షన్స్ లో దుమ్ములేపిన BJP
TG Gram Panchayat Polls-2025
వార్టుల్లో గెలిచిన సభ్యులు ఉపసర్పంచ్‌ను ఎన్నుకోనున్నారు. ఈ రెండోదశలో రాష్ట్రవ్యాప్తంగా 193 మండలాల్లోని 3911 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, 29,917 వార్డు సభ్యల పదవులకు పోలింగ్ నిర్వహించారు. అయితే 12,782 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి బరిలోకి దిగారు. 71,071 మంది అభ్యర్థులు వార్టు స్థానాలకు పోటీ చేస్తున్నారు.
Also Read: ఓటుకు రూ.40 వేలు.. వెండి, బంగారం కూడా.. సర్పంచ్ ఎన్నికల్లో ఆల్ టైమ్ రికార్డ్!
Follow Us