తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. త్వరలో మీ ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నాయి. ఈ విషయాన్ని నేరుగా వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా అంశంపై చర్చ పెట్టగా.. దీనిపై స్పందించి ఆయన మాట్లాడారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
సంక్రాంతికి రైతు భరోసా
అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం పెట్టారు. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఈ జిల్లాలలో భారీ వానలు!
సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం
అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి కాకుండా తమ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందజేస్తామని తెలిపారు. గతంలో సాగులోలేని భూములకు రైతుబంధు నిధులు జమ చేశారని ఆయన పేర్కొన్నారు.
రెండు విడతల్లో రూ.15 వేల సాయం
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తయింది. అయినా ఇప్పటి వరకు రైతులకు రైతుభరోసా పెట్టుబడి సాయం అందలేదు. దీంతో చాలా మంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రైతులకు ఎకరాకు రూ.10వేల పంట సాయం అందించింది. దీనిని రెండు విడతల్లో అంటే ఖరీఫ్, రబీ సీజన్లలో అందించింది. ఇక కాంగ్రెస్ ఎకరాకు రూ.15వేలు అందిస్తామని హామి ఇచ్చింది. ఈ పంట సాయాన్ని రెండు విడతల్లో అందిస్తామని పేర్కొంది.
బీఆర్ఎస్ హయాంలో అనర్హులకు ఆర్థిక సాయం
Also Read: Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు
అయితే రైతు భరోసా పథకం అమలు కాకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో రైతుబంధు పథకం ద్వారా అనర్హులకు సైతం ఆర్థిక సాయం అందిందని వారు ఆరోపిస్తున్నారు. అందువల్లనే దీనిలో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. అనంతరం పథకం అమలుపై ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ నిర్వహించింది. దీని కారణంగానే రైతు భరోసా అమలు కాస్త లేట్ అయిందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొస్తున్నారు.