TG Govt:వికారాబాద్‌ కలెక్టర్ దాడిపై సీఎం రేవంత్ సీరియస్.. కీలక ఆదేశాలు

వికారాబాద్‌ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్‌ జైన్‌, అధికారులపై లగచర్ల గ్రామస్థుల దాడి దుమారం రేపుతోంది. అయితే ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్‌ అయ్యింది. దీనిపై అధికారులను విచారణకు ఆదేశించింది. సోమవారం అర్ధరాత్రి 28 మంది గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేశారు.

New Update
rev col

వికారాబాద్‌ జిల్లాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకై అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రతీక్‌ జైన్‌, అధికారులపై లగచర్ల గ్రామస్థులు దాడులు చేసిన ఘటన దుమారం రేపుతోంది. అయితే ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్‌ అయ్యింది. దీనిపై అధికారులను విచారణకు ఆదేశించింది. సోమవారం అర్ధరాత్రి  లగచర్లలో 28 మంది గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని పరిగి లీస్పో స్టేషన్‌కు తరలించారు. ఆ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. 

Also Read :  'గేమ్ ఛేంజర్' ను ఫాలో అవుతున్న 'పుష్ప2'..!?

ఈ దాడి ఘటనపై ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు. బోగమోని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారని.. కలెక్టర్‌ను, అధికారులను పక్కకు తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగానే గ్రామస్థులతో దాడులు చేయించారని చెప్పారు. అయితే సురేష్‌ను బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తగా గుర్తించామని.. అతడి స్వస్థలం హైదరాబాద్‌లోని మణికొండ అని వెల్లడించారు. 

Also Read: రూట్ మార్చిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ ఏంటో తెలుసా?

Vikarabad's Villagers Attack On Collector

ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడులు చేసేలా సురేష్ అక్కడి గ్రామస్థులన రెచ్చగొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరు గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందని.. ఎవరూ కూడా వదంతులు నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిన తర్వాత దాడి వెనుక ఎవరున్నా సరే..కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం సురేష్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఐజీ నారాయణ రెడ్డి అన్నారు.   

Also Read: KTRను బీజేపీ కాపాడుతుందా? ముందున్న మూడు ఆప్షన్లు ఇవే!

ఇదిలాఉండగా.. లగచర్లలో అధికారులపై జరిగిన దాడిపై బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్, హరీశ్‌ రావు కూడా స్పందించారు.  "అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు!.. బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు!.. అర్దరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా?.. రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా?.. ఇదేనా ప్రజాస్వామ్య పాలనా?రైతు సంక్షేమ పాలన?..  ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం !'' అంటూ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా విమర్శించారు. మరోవైపు రేవంత్‌పై తిరగబడని వర్గం ఏదైనా ఉందా అంటూ మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. రైతులు సీఎంపై ఉన్న కోపాన్ని అధికారులపై చూపిస్తున్నారని పేర్కొన్నారు.

Also Read :  రాష్ట్రంలో రూ.65,000 కోట్ల పెట్టుబడి.. 2లక్షల 50వేలమందికి ఉద్యోగాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు