Formula E race: KTRను బీజేపీ కాపాడుతుందా? ముందున్న మూడు ఆప్షన్లు ఇవే!

ఫార్ములా ఈ రేసు కేసులో బీజేపీ కేటీఆర్ ను కాపాడుతుందా? విచారణ జరగకుండా అటార్నీ జనరల్, గవర్నర్ ద్వారా అడ్డుకుంటుందా? కేటీఆర్ ఢిల్లీ టూర్ బీజేపీ పెద్దల నుంచి సాయం పొందేందుకేనా? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

New Update
BJP BRS KTR

ఫార్ములా-ఈ కేసు నుంచి కేటీఆర్ బయటపడనున్నారా? బీజేపీ సహకారంతో కేసు విచారణ నుంచి తప్పించుకోనున్నారా? కేటీఆర్ ఢిల్లీకి వెళ్లిందే అందుకా? గత రెండు రోజులుగా కాంగ్రెస్ నేతల కామెంట్స్, పలు మీడియాలో కథనాలు ఈ ప్రశ్నకు సమాధానం అవును అనే అంటున్నాయి. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఫార్ములా-ఈ రేసు కేసులో తనను కాపాడుకునేందుకు ఢిల్లీ వెళ్లాడని ఆరోపించారు. ఆయన తప్పు చేయకుంటే విచారణకు సహకరించాలన్నారు. మరో కీలక మంత్రి పొంగులేటి సైతం ఇదే విధంగా కామెంట్ చేశారు. కేటీఆర్ రేపో మాపో అరెస్ట్ అవుతానని తెలిసి అంబానీ, అదానీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దలను కలిసి తనపై నమోదైన కేసులు మాఫీ చేసుకోవడం కోసమే ఢిల్లీ వెళ్లాడంటూ ఆరోపణలు చేశారు. బీజేపీ పెద్దలతో రాజీ కుదుర్చుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు తమకు సమాచారం ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ’ టీమ్ గా పని చేస్తోందని మంత్రి సీతక్క కామెంట్ చేశారు.

ఇది కూడా చదవండి: YS Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

గవర్నర్ కోర్టులో బంతి..

ప్రివెన్షన్ ఆఫ్‌ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17ఏ ప్రకారం మంత్రిగా పని చేసిన కేటీఆర్ ను విచారించాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి గవర్నర్ కు ప్రభుత్వం నుంచి లేఖ రాసింది. అయితే.. గవర్నర్ ఇందుకు సంబంధించి అటార్నీ జనరల్ కు లేఖ రాశారు. అటార్నీ జనరల్ సూచన ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే అటార్నీ జనరల్, గవర్నర్ నడుచుకుంటారన్న ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి: సినీ ఇండస్ట్రీ ఐదారుగురు హీరోలదే కాదు.. మంత్రి కోమటిరెడ్డి ఫైర్!

అటార్నీ జనరల్ గవర్నర్ కు ఈ కింది మూడు సూచనల్లో ఏదో ఒకటి ఇచ్చే అవకాశం ఉంది..
1. విచారణలో అప్పటి మంత్రులను పక్కన పెట్టాలని..
2. నిధుల మళ్లింపులో బిజినెస్ రూల్స్ ను బ్రేక్ చేయలేదని..
3. కేటీఆర్ పై విచారణ జరపొచ్చు..

Also Read : పూనకాలు తెప్పించే 'పుష్ప-2' అప్డేట్.. ఇక రచ్చ రచ్చే

అలా చేస్తే కేటీఆర్ కు బిగ్ రిలీఫ్..

మొదటి రెండు సూచనల్లో ఏదో ఒకటి ఇచ్చినా.. కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ దొరుకుతుంది. ఆయనపై విచారణ ఇక ఉండదు. దీంతో కేటీఆర్ ఈ కేసు నుంచి దాదాపు బయటపడినట్లే అవుతుంది. బీఆర్ఎస్ నేతలు ఆరోపించినట్లు బీజేపీ పెద్దలను నిజంగానే రంగంలోకి దిగి అటార్నీ జనరల్, గవర్నర్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తే ఇది సాధ్యం అవుతుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందటూ గతంలో జరిగిన చర్చను ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నారు. కవిత జైలులో ఉన్న సమయంలో వచ్చిన మీడియా కథనాలను ప్రస్తావిస్తున్నారు. ఆ మీడియా కథనాల్లో పేర్కొన్నట్లుగానే కవితకు బెయిల్ వచ్చిందని.. ఇప్పుడు కేటీఆర్ కు కూడా బీజేపీ హెల్ప్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తు అంశం మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

అలా కాదని కేటీఆర్ పై విచారణ జరపొచ్చని అటార్నీ జనరల్ గవర్నర్ కు సూచిస్తే అది కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు బిగ్‌ షాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ కేసులో ఏసీబీ మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది. దీంతో కేటీఆర్ దాదాపుగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. 

Also Read:  AP: ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఒక్కొక్కరికి రూ.15వేలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు