HYDRA: రూట్ మార్చిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ ఏంటో తెలుసా? చెరువుల్లో నీటి కాలుష్యంపై హైడ్రా ఫోకస్ పెట్టింది. పీసీబీ నిర్లక్ష్యం వల్లే అపార్ట్ మెంట్లు, ఫాంహౌస్‌ల నుంచి వస్తున్న మురుగు చేరి చెరువులు విషతుల్యం అవుతున్నట్లు గుర్తించింది. పీసీబీతో చర్చల అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By srinivas 12 Nov 2024 | నవీకరించబడింది పై 12 Nov 2024 14:34 IST in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపిన హైడ్రా ఇప్పుడు రూట్ మార్చింది. చెరువుల్లో నీటి కాలుష్యంపై ఫోకస్ పెట్టింది. పీసీబీ నిర్లక్ష్యం వల్ల పరిశ్రమలనుంచి వస్తున్న కెమికల్స్, అపార్ట్ మెంట్లు, ఫాంహౌస్‌ల నుంచి వస్తున్న మురుగునీరు కారణంగా చెరువలు విషతుల్యం అవుతున్నట్లు గుర్తించింది. దీంతో నివారణ చర్యలపై ఫోకస్ పెట్టిన హైడ్రా.. కర్ణాటక తరహాలో వ్యర్థాలు చెరువుల్లో కలవకుండా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. Also Read : KTRను బీజేపీ కాపాడుతుందా? ముందున్న మూడు ఆప్షన్లు ఇవే! రూల్స్ పట్టించుకోని జనాలు.. ఈ మేరకు చెరువుల్లోకి వస్తున్న మురుగును సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)ల ద్వారా చెరువులను నింపుతున్న విధానాన్ని హైడ్రా అధికారులు పరిశీలించారు. చెరువుల పునరుద్దరణకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అనుసరిస్తున్న విధానాలను హైడ్రా అధ్యయనం చేశారు. సుందరీకరణతో పాటు చెరువులోకి మురుగు చేరకుండా పై భాగంలో కుంటలు ఏర్పాటు చేసి సిల్ట్ నుంచి నీటిని వేరు చేసే విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. కొన్ని చెరువుల దగ్గర కనీసం కొన్ని సెకన్లు కూడా నిలబడలేని దుస్థితి ఉందని తేలడంతో.. ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పీసీబీ అధికారులతో చర్చించారు. అపార్టుమెంట్లలో సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్లు పెట్టుకోవాలనే రూల్స్ ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవట్లేదు. మరికొందరు ప్లాంట్లు పెడుతున్నా రూ.లక్షల్లో కరెంట్ బిల్లులు వస్తున్నాయనే భయంతో వాడకుండా వదిలేస్తున్నారు. దీంతో మురుగు నీరు డ్రెయిన్ల ద్వారా చెరువులు, కుంటల్లోకి చేరి విషతుల్యమవుతోందని గుర్తించారు. ఇది కూడా చదవండి: Formula E race: KTRను బీజేపీ కాపాడుతుందా? ముందున్న మూడు ఆప్షన్లు ఇవే! డైరెక్ట్ పైపు లైన్ల ద్వారా జలాశయాల్లోకి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల సమీపంలోని ఫాంహౌస్ లు, కమర్షియల్ యాక్టివిటీస్ కొనసాగిస్తున్న కొందరు మురుగును నేరుగా చెరువుల్లోకి వదిలేస్తున్నారు. మరికొందరు డైరెక్ట్ పైపు లైన్ల ద్వారా జలాశయాల్లోకి మురుగును వదులుతున్నారు. దీంతో వారిపై చర్యలు తీసుకునే హైడ్రా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక హైడ్రా పరిధిలో 549 చెరువులుండగా 100 చెరువులు మురుగు చేరి దుర్వాసన వస్తున్నాయి. హుస్సేన్ సాగర్, బాలానగర్ కాలువలో కెమికల్ వ్యర్థాలు కలుస్తూనే ఉన్నాయి. దుండిగల్‌లోని కుడికుంటలోకి స్థానిక పరిశ్రమల నుంచి కెమికల్ వ్యర్థాలు చేరుతున్నాయి. ఇది కూడా చదవండి: YS Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం! ఇక ఈ వ్యర్థాలపై సెంటర్ ఫర్ వెల్బీయింగ్ ఎకనామిక్స్ హైదరాబాద్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ లుబ్నా సర్వత్ మాట్లాడుతూ.. చెరువులను కాలుష్యం నుంచి కాపాడాలన్నారు. పరిశ్రమల నుంచి వ్యర్థాలు రాకుండా జాగ్రత్తలు చేపట్టాల్సిన బాధ్యత హైడ్రాపై ఉందన్నారు. లేదంటే భూగర్భ జలాలు మొత్తం కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. Also Read : పూనకాలు తెప్పించే 'పుష్ప-2' అప్డేట్.. ఇక రచ్చ రచ్చే #hydra #pcb #av-ranganath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి