Local Body Elections:  స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కారు సిద్ధం.. దసరా లోపే షెడ్యూల్‌

లోకల్ బాడీ ఎలక్షన్స్ కు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. ఎన్నికల నిర్వహణకు స్పెషల్ జీవోతోనే ముందుకు వెళ్లేందుకు సిద్దం అవుతోంది. ఎన్నికల షెడ్యూల్ ను కూడా దసరా లోపే రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

New Update
CM Revanth

CM Revanth

లోకల్ బాడీ ఎలక్షన్స్(local-body-elections) కు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. ఎన్నికల నిర్వహణకు స్పెషల్ జీవోతోనే ముందుకు వెళ్లేందుకు సిద్దం అవుతోంది. ఎన్నికల షెడ్యూల్ ను కూడా దసరా లోపే రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో పెంచిన రిజర్వేషన్లను అమలు చేసేందుకు వీలుగా పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285(బీ)లో చేసిన సవరణలతో  జీవో జారీ చేయాలని సర్కార్ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దసరా లోపు షెడ్యూల్ విడుదలకు వీలుగా రెండు రోజుల్లోగా రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లకు ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం.  ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే ఆయా స్థానాల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లను జిల్లాల వారీగా ప్రకటించేలా అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలని కూడా కలెక్టర్లకు సూచించినట్లుగా తెలుస్తోంది. 

Also Read :  మేడ్చల్‌లో దారుణం.. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్‌ విద్యార్థి సూసైడ్

సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమావేశం 

కాగా రిజర్వేషన్‌ల ఖరారుకు అవసరమైన సమాచారం మొత్తాన్నీ ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు అందించింది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం చూస్తే బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం(congress-govt) ఏర్పాటైన తరువాత 2024లో నిర్వహించిన కులగణన వివరాల ప్రకారం ఖరారు చేయాలని కలెక్టర్లకు సూచించింది. ఆ వివరాలన్నింటినీ కలెక్టర్లు సోమవారం నిర్వహించే సమావేశంలో క్షేత్రస్థాయి అధికారులకు అందించి రిజర్వేషన్లను ఖరారు చేయాలని సూచించనున్నారు. కాగా స్థానిక ఎన్నికల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఒకటి రెండు రోజుల్లోరోజుల్లో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిసింది. ఆ సమావేశంలో ఎన్నికల నిర్వహణ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  ఈ ప్రక్రియ పూర్తయితే స్థానిక ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అవుతుంది.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గ్రామాలను మున్పిపాలిటీల్లో విలీనం చేసింది .తాజా వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామపంచాయతీలు, 565 మండలాలు, 31 జిల్లాలు ఉన్నాయి. 1,12,534 మంది వార్డు సభ్యులు ఉండగా.. 5,763 ఎంపీటీసీలు, 565 మండల ప్రజా పరిషత్‌లు, 31 జిల్లా ప్రజాపరిషత్‌లు ఉన్నాయి. వీటి ప్రకారం రిజర్వేషన్‌లను ఖరారు చేయనున్నారు. 

Also Read :  బిగ్ అలర్ట్.. అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Advertisment
తాజా కథనాలు