/rtv/media/media_files/2025/01/29/txSY6zHe7itdecQc6dYd.jpg)
Telangana govt key decision on agricultural mechanization
TG Farmers: రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త చెప్పనున్నారు. వ్యవసాయంలో రైతుల శ్రమ తగ్గించేందుకు యాంత్రీకరణ ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సబ్సిడీ రూపంలో ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పవర్ స్పేయర్లు, డ్రోన్లతోపాటు తదితర 20 పరికరాలను అందించాలని ఫిక్స్ అయింది. ఇప్పటికే యంత్రాల కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకునేందుకు టెండర్లు ఆహ్వానించింది వ్యవసాయ శాఖ.
ఫిబ్రవరి 7వరకు టెండర్ల దాఖలు..
ఈ మేరకు సదరు కంపెనీలకు ఫిబ్రవరి 7వరకు టెండర్లను దాఖలు చేసుకునే అవకాశం కల్పించగా.. బిడ్‌లను ఫిబ్రవరి 8న ఓపెన్ చేయనున్నారు. ఇక సబ్సిడీ కింద ఇచ్చే యంత్రాలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వ్యవసాయశాఖ తెలిపింది. ఇక గత ప్రభుత్వం 600 ట్రాక్టర్లు, 160 వరకు డ్రోన్లు సబ్సిడీ కింద అందించగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దుక్కి దున్నేందుకు ఆ ట్రాక్టర్లకు కల్టివేటర్, ప్లవ్, రోటవేటర్లు అమర్చే పరికరాలనూ అందించనుంది.
ఈ టెండర్లలో 12వేల యూనిట్ల రోటవేటర్లు, 4వేల యూనిట్ల కల్టివేటర్లు, రూ.2వేల యూనిట్ల ప్లవ్, 200 యూనిట్ల గడ్డికట్టే యంత్రాలు, అనవసర గడ్డిని తొలగించేందుకు 400 బ్రష్ కట్టర్లు, 64 పొలం గట్లు వేసే బండ్ ఫోర్మర్లు, మొక్కల మధ్య గడ్డి తొలగించేందుకు 200 పవర్ వీడర్స్ అందించనుంది. అలాగే 80 మక్కలు పట్టే మిషన్, 420 పవర్ ట్రిల్లర్‌లు, 12వేల 16-20 లీటర్ల ట్యాంకు సామర్ధ్యం కలిగిన పవర్ స్ర్పేయర్‌లు, 6,300లు12-16 లీటర్ల ట్యాంకు సామర్థ్యం కలిగిన పవర్ స్ర్పేయర్‌లు, నీటిని సరఫరా చేసే 1,230 యూనిట్ల పీవీసీ, హెచ్‌డీపీఈ పైపులు 1,40,000, స్టోరేజీ బిన్స్ 50, డీజిల్, కరెంటుతో నడిచే పంపుసెట్లు కూడా ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: జూ.ఎన్టీఆర్ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్!