/rtv/media/media_files/2024/10/21/XxqffGSi7ec5WG61WlIC.jpg)
Telangana govt good news Indiramma houses Beneficiaries
Indiramma illu: ఇందిరమ్మ ఇళ్లపై సంక్రాంతి వేళ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్దిదారుల జాబితాను విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేసి ఇళ్ల దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక,కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పై జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది pic.twitter.com/KA6ISzDQJh
— Ponnam Prabhakar (@Ponnam_INC) January 12, 2025
అర్హులైన వారి డేటా ఎంట్రీ..
ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల గురించి మాట్లాడిన పొన్నం ప్రభాకర్.. రేషన్ కార్డుల ప్రక్రియను మొదలైందని చెప్పారు. అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, జనవరి 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్దిదారుల జాబితా తయారు చేస్తామన్నారు. అలాగే జనవరి 21 నుంచి అర్హుల డేటా ఎంట్రీ చేస్తామన్నారు. ఇక 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తామని చెప్పిన మంత్రి.. తదనంతరం ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్స్ స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
వలస వచ్చిన వారికి పథకాలు..
ఇక హైదరాబాద్‌లో స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. 'రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ న్యాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. అర్హులందరికీ పథకాలు అందేలా చూస్తాం. ఇల్లు లేని వారికి తప్పకుండా మంజూరు చేస్తాం. జిల్లాల నుంచి హైదరాబాద్ వలస వచ్చిన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. సగంలో ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేస్తాం. లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది' అని వివరించారు.
ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్లో భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు నక్సలైట్లు హతం
Follow Us