ఛత్తీస్‌గఢ్లో భారీ ఎన్‌కౌంటర్‌ .. నలుగురు నక్సలైట్లు హతం

ఛత్తీస్‌గఢ్లో మావోలు పిట్టల్లా రాలిపోతున్నారు. దండకారణ్యాన్ని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి.  తాజాగా మావోలకు, భధ్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరగగా..  నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోలనుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

New Update
Bijapur Maoist

Bijapur Maoist Photograph: (Bijapur Maoist )

ఛత్తీస్‌గఢ్లో మావోలు పిట్టల్లా రాలిపోతున్నారు.  దండకారణ్యాన్ని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి.  బీజాపూర్ ఐఈడీ బ్లాస్ట్లో డీఆర్జీ జవాన్ల మృత్యువాత ఘటనకు బదులుగా భద్రతాబలగాలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి.  తాజాగా 2025 జనవరి 12వ తేదీన బీజాపూర్ జిల్లా మద్దేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరన్ జోడ్ అటవీప్రాంతంలో మావోలు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతాబలగాలు కూంబింగ్ చేపట్టారు. దీంతో భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు షురూ చేశారు. ఈ క్రమంలో మావోలకు, భధ్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరగగా..  ఇందులో  నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్), డిస్ట్రిక్ట్ ఫోర్స్‌కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు .  

ఆయుధాల డంప్ స్వాధీనం

సంఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పారిపోయిన మావోల గురించి గాలింపు చేపట్టారు.  నారాయణపూర్ జిల్లా సోన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిర్గేనార్ అటవీ ప్రాంతంలో మావోల భారీ ఆయుధాల డంప్ ను స్వాధీనం చేసుకున్నాయి భధ్రతా బలగాలు.  కాగా  జనవరి 4న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సలైట్లు మరణించారు. ఇది జరిగిన మరుసటి రోజు అంటే  జనవరి 6న బీజాపూర్ జిల్లాలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (IED) ఉపయోగించి పేల్చివేయడంతో ఎనిమిది మంది జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది, ఒక డ్రైవర్ మరణించారు . బెద్రే-కుట్రు రోడ్డులో భద్రతా బృందం తమ ఆపరేషన్ ను ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ  పేలుడు సంభవించింది. 

అటు ఇప్పటికే  2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసింది . గతేడాది డిసెంబర్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ..  ఛత్తీస్‌గఢ్‌లోని రెండు జిల్లాలు మాత్రమే నక్సల్స్ ప్రభావంలో ఉన్నాయని.. వాటిని 2026 మార్చి 31, 2023 నాటికి విముక్తి చేస్తామన్నారు.  

Also Read :  KTR అవినీతి చేయలేదని చెప్పలేదే..  ఎమ్మెల్యే  దానం యూటర్న్

Advertisment
తాజా కథనాలు