/rtv/media/media_files/2025/04/21/bBHSEzkmrrjeiU8WRPl5.jpg)
Telangana Secratariate
తెలంగాణ సెక్రటరియేట్‌లో ఇటీవల ఫేక్ ఉద్యోగులు బయటపడటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సెక్రటేరియట్ భద్రత ఏర్పాట్లు, ముఖ్యమంత్రి ప్రవేశ మార్గం, ఎగ్జిట్ వద్ద సీసీ కెమెరాల నిఘాపై ఆరా తీసింది. సీఎం ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో సీసీ కెమెరాలు లేవని జేఏడీ గుర్తించింది. సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదంటూ ఎస్పీఎఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే సెక్రటరియేట్ మొత్తం 246 సీసీ కెమెరాలు.. మరో 30 కెమెరాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు నిఘా వర్గాలు చెప్పాయి. ముఖ్యమంత్రి ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలతో పాటు భవనం 6వ అంతస్తులో భద్రత పెంచాలని నిర్ణయించాయి. సాధారణ ప్రజలు వచ్చే సౌత్ ఈస్ట్ గేటుతో సహా ఇన్‌సైడ్ ఎంట్రీ వద్ద మరోసారి చెకింగ్ చేయనున్నారు.
Also Read: మరోసారి రెచ్చిపోయిన ఖలిస్థానీ వేర్పాటువాదులు.. కెనడాలో హిందూ ఆలయంపై దాడి
అలాగే సెక్రటరియేట్‌లో ఎస్పీఎఫ్ రెండంచెల భద్రత వలయాన్ని కూడా మోహరించింది. ఇదిలాఉండగా గత కొన్నిరోజులుగా తెలంగాణ సచివాలయంలో ఫేక్ ఉద్యోగులు బయటపడటం కలకలం రేపుతోంది. ఫేక్ ఐడీ కార్డులతో ఉద్యోగిగా సచివాలయంలోకి ప్రవేశసిస్తున్నారు. వాళ్లని భద్రత సిబ్బంది కూడా ఆ తర్వాత అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరగడంతో రేవంత్ సర్కార్ దీనిపై సీరియస్ అయ్యింది. మళ్లీ ఇలా ఫేక్ ఉద్యోగుల సచివాలయంలో రాకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
Also read: వెంటనే ఆపేయండి.. ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చిన సౌదీ
Also Read: ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !
rtv-news | telugu-news | secratariate | fake employees | telangana