TGPSCపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! TG: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) పరిపాలన, పరీక్షల విధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టీజీపీఎస్సీకి అదనంగా 142 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 10 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి TGPSC: రేవంత్ సర్కార్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అదే తరహాలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిపాలన, పరీక్షల విధానాన్ని బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. తాజాగా టీజీపీఎస్సీకి అదనంగా 142 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. Also Read: US: ట్రంప్ గెలుపు...అమెరికాకు గుడ్ బై చెబుతున్న హాలీవుడ్ హీరోయిన్లు సిబ్బంది కొరత... కాగా మొత్తం 142 పోస్టులలో కొన్నింటిని ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై, మరికొన్నింటిని ప్రత్యక్ష నియామకం కింద భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు టీజీపీఎస్సీని బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా ప్రముఖ విద్యాసంస్థ ఆధ్వర్యంలో కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ లోతైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. టీజీపీఎస్సీలోనూ యూపీఎస్సీ తరహా పరిపాలన, పరీక్షల నిర్వహణ విభాగాలు ఉండేలా చర్యలు సూచించింది. ఇదిలా ఉంటే... ఇప్పటివరకు టీజీపీఎస్సీలో కమిషన్ కోసం ప్రత్యేకంగా నియామకమైన సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. Also Read: USA: ట్రంప్ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు మరోవైపు కమిషన్‌లోసిబ్బంది కొరత ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ TGPSC బోర్డుకు చైర్మన్ గా తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు జరిగాయి. అయితే.. ఈసారి కూడా గ్రూప్ 1 పరిక్షాలు రద్దు అవుతాయనే చర్చ జరగగా.. పరీక్షలు మాత్రం సాఫీగా జరిగాయి. ప్రతి ఏడాది UPSC తరహాలో జాబ్ క్యాలెండర్ ను TGPSC విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్ Also Read: Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ! #telangana #tgpsc #revanth-reddy #upsc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి