US: ట్రంప్‌ గెలుపు...అమెరికాకు గుడ్‌ బై చెబుతున్న హాలీవుడ్‌ హీరోయిన్లు

ట్రంప్ గెలుపుపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే హాలీవుడ్ స్టార్స్ కొందరు అమెరికాను వదిలి వెళ్లిపోతామని ప్రకటించడం సంచలనం రేపుతోంది.

New Update
usa

US : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించి వైట్‌ హౌస్‌ లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌ వచ్చే ఏడాది జనవరిలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో  శ్వేతసౌధంలోకి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అడుగుపెట్టనున్న వేళ.. దీనిని కొందరు తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు హాలీవుడ్ హీరోయిన్లు.. తాము అమెరికాను విడిచిపెట్టి ఇతర దేశాలకు వెళ్లిపోతామని ప్రకటిస్తున్నారు. అయితే రోజురోజుకూ ఈ సంఖ్య పెరగడం అమెరికాలో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది.

Also Read: Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్‌..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ!

తాజాగా ఎలాన్ మస్క్ కుమార్తె వివియాన్ ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా సంచలన విషయాన్ని తెలిపారు. ట్రంప్ రాకతో తన లాంటి వారికి అమెరికాలో భవిష్యత్ కనిపించడం లేదని.. అందుకే దేశాన్ని వీడాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే హాలీవుడ్ స్టార్స్ కూడా అదే బాటలో పయనిస్తుండటం గమనార్హం. అమెరికా ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి కూడా ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్‌ స్నేహం రోజురోజుకూ మరింత బలపడింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ విజయం తర్వాత.. లింగ మార్పిడి చేసుకున్న ఎలాన్ మస్క్ కుమార్తె, 20 ఏళ్ల వివియన్ జెన్నా విల్సన్ సంచలన ప్రకటన చేశారు. 

Also Read:  Canada: విద్యార్థులకు బ్యాడ్ న్యూస్..కెనడా స్టూడెంట్ వీసా స్టాప్..

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచారు కాబట్టి.. ఇక అమెరికాలో తనలాంటి ట్రాన్స్‌జెండర్లకు భవిష్యత్తు లేదని అర్ధమైందని.. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత.. దేశం విడిచి వెళ్లిపోవాలనే భావన తనలో బలపడిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలోని చాలామంది హై ప్రొఫైల్ హాలీవుడ్ సెలిబ్రిటీలు కూడా యూఎస్ వదిలి వెళ్లిపోతున్నట్లు సమాచారం.

Also Read:  USA: ట్రంప్‌ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు

పిల్లల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని..

ప్రముఖ హాలీవుడ్ నటి 40 ఏళ్ల అమెరికా ఫెరీరా తాను బ్రిటన్‌కు వెళ్లనున్నట్లు ప్రకటించారు. తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని అమెరికాను వీడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఓటమిపై అమెరికా ఫెరీరా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరో హలీవుడ్ ప్రముఖ నటి షెరాన్ స్టోన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను ఇటలీకి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

Also Read:  AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు

ద్వేషం, అసహనం అనే దుర్మార్గపు పునాదులపై నిలబడి అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచారని ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో తన ఆరోగ్యం దెబ్బతిందని.. ప్రముఖ హాలీవుడ్ సింగర్, నటి చెర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను అమెరికా వీడటం ఖాయమని ప్రకటించారు. మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనపుడు తనకు అల్సర్ వచ్చిందంటూ చెర్ వెటకారంగా కామెంట్లు కూడా చేశారు. ఇక గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో కీలక పాత్ర పోషించిన బ్రిటీష్ నటి సోఫీ టర్నర్ ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్నారు. తాజాగా తిరిగి ట్రంప్ అధికారంలోకి రావడంతో.. తాను తిరిగి స్వదేశం బ్రిటన్‌కు వెళ్లిపోవాలనే ఆలోచనను వెల్లడించారు.

మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి చాలా నెలల ముందే.. బ్రిటీష్ నటి 54 ఏళ్ల మిన్నీ డ్రైవెర్ అమెరికా నుంచి యూకేకు వెళ్లిపోయారు. అయితే ఆమె యూకేకు వెళ్లడానికి ముందు మాట్లాడుతూ.. మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. దాదాపు 30 ఏళ్ల పాటు మిన్నీ డ్రైవెర్ లాస్ ఏంజెలెస్‌లో నివసించగా.. అకస్మాత్తుగా యూఎస్ నుంచి వెళ్లిపోవడం గమనార్హం.

Advertisment
Advertisment
తాజా కథనాలు