USA: ట్రంప్‌ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు

ట్రంప్ గెలవడం అమెరికాలో చాలామంది మహిళలకు అస్సలు నచ్చలేదు. తాము సపోర్ట్ చేసిన కమలా హారిస్ గెలవకపవడం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి కారణం అమెరికాలో ఉన్న మగవాళ్ళే నని వారితో సెక్స్ చేయం, పిల్లలను కనం అంటూ నిరసన చేస్తున్నారు.

New Update
11

4B Movment: 

అమెరికాలో కొత్త ఉద్యమం మొదలైంది. అదే 4B ఉద్యమం. కొత్త అధ్యక్షుడు ట్రంప్, ఆయనను గెలిపించిన పురుషులకు వ్యతిరేకంగా అమెరికాలో మహిళలు నిర్వహిస్తున్న ఉద్యమం ఇది.  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడం ఆ దేశంలోని లక్షలాది మంది మహిళలకు నచ్చలేదు. డెమొక్రాట్ అభ్యర్థి కమల హారిస్ గెలుస్తుందని మహిళలు భావించారు. కానీ వారి కలలన్నీ ట్రప్ విజయంతో చెదిరిపోయాయి. దీనికి మగవాళ్లే కారణం అంటూ అమెరికా మహిళలు నిప్పులు చెరుగుతున్నారు. చాలా మంది మహిళలు పురుషులతో సెక్స్, డేటింగ్, పిల్లలు కనడం వంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే 4B ఉద్యమంలో చేరారు. ఈ మూవ్‌మెంట్ ఇప్పుడు అక్కడ ట్రెండ్ అవుతోంది. పురుషులతో సబంధాలు పెట్టుకోవద్దంటూ కొంత మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు. 

Also Read :  నేరుగా ఓటీటీలోనే తమన్నా క్రైమ్ థ్రిల్లర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

అలేంటీ 4B మూమెంట్...

4B అంటే 4 టైమ్స్ నో అని అర్థం. కొరియన్‌లో ‘‘Bi’’ అంటే ‘‘వద్దు’’ అని అర్ధం. 2018లో సౌత్ కొరియాలో ఇలాంటి ఉద్యమం మొదలైంది. అక్కడి రాడికల్ ఫెమినిస్టులు ఈ ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతం చేశారు.పెళ్ళి,సెక్స్, బిడ్డల్ని కనడం, డేటింగ్ లాంటి నాలుగు విషయాల్లో మగవారికి దూరంగా ఉండడమే దీని ఉద్దేశం. 

Also Read :  అందరికీ దూరంగా ఒంటరిగా.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అర్జున్ కపూర్!

అమెరికాలో ఎందుకు?

అమెరికా ఎన్నికలలో కీలక పాత్ర పోషించిన అంశాలలో అబార్షన్ చట్టం ఒకటి.  అమెరికాలో లక్షలాది మంది మహిళలు చట్టబద్ధంగా అబార్షన్ చేయించుకునే హక్కును కోల్పోతున్నారు. దాదాపు 50 ఏళ్ళ కిందట అబార్షన్‌ను దేశవ్యాప్తంగా చట్టబద్ధం చేస్తూ వెలువడిన తీర్పును అమెరికా సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో అక్కడ ఆలా రాష్ట్రాలు అబార్షను అనుమతులను కఠినతరం చేశాయి, నిషేధించాయి. అయితే అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ ఈ పునరుత్పత్తి హక్కుల్ని కాపాడతానని ప్రామిస్ చేశారు. ట్రంప్ దీని గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ కమలా హారిస్ గెలవలేదు. దీంతో అమెరికా మహిళలు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. కావాలనే పురుషులందరూ కలసి ట్రంప్‌ ను గెలిపించారని వారు భావిస్తున్నారు. అందుకే 4B ఉద్యమంలో చేరారు. సోషల్ మీడియాలో దీని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మహిళలు మరవకండి మనకు శక్తి ఉంది. మన శరీరాలను మగవారికి అప్పగించడం మన ఛాయిస్. దీన్ని ఇక మనం చేయాల్సిన అవసరం లేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. 

Also Read :  దాతృత్వంలో శివ్ నాడార్ టాప్.. ఎన్ని కోట్లు విరాళమంటే?

Also Read: కారుకు గ్రాండ్‌గా అంత్యక్రియలు..నాలుగు లక్షల ఖర్చు..ఎక్కడో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు