TG Ration Card Applications: రేషన్ కార్డు దరఖాస్తులకు లాస్ట్ డేట్.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన!

రేషన్‌ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్, ఎడిట్ ఆప్షన్ వంటి ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఫౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. తుది గడువు అనేది ఏమీ ఉండదని, ప్రజలు ఆందోళన చెందకూడదని సూచించింది. 

New Update
ration card

Telangana Government key announcement on Ration Card Applications

TG Ration Card Applications: రేషన్‌ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్, ఎడిట్ ఆప్షన్ వంటి ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఫౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. తుది గడువు అనేది ఏమీ ఉండదని, ప్రజలు ఆందోళన చెందకూడదని సూచించింది. 

దరఖాస్తు ప్రక్రియ నిరంతరం..

ఈ మేరకు ఇటీవల గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల లిస్టులో తమ పేరు లేనివారు ఆఫ్‌లైన్‌లలో అప్లయి చేసేందుకు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అధిక సంఖ్యలో దరఖాస్తు దారులు రేషన్‌ కార్డుల కోసం అప్లయి చేసుకోలేదని, ఇప్పుడు దరఖాస్తు చేస్తే సర్వర్లు బీజీ వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కొత్త రేషన్‌ కార్డులు వస్తాయే లేదోనని వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఫౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపింది. అలాగే సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రూపొందించిన జాబితాలో పేర్లు లేని కుటుంబాలు కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. 

ఇది కూడా చదవండి: Pregnancy: ప్రెగ్నెన్సీ గురించి ఫస్ట్ 3నెలలు ఎందుకు దాస్తారు.? ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా?

‘రేషన్‌ కార్డుల అప్లికేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దీనికి ఎలాంటి గడువు లేదు. దరఖాస్తుదారులు ఆందోళనకు గురికావొద్దు. ప్రజావాణిలో దరఖాస్తు చేసిన వారు మరోసారి అప్లే చేయాల్సిన అవసరం లేదు. మీ సేవలో అప్లయి చేస్తే రసీదులను జాగ్రత్తగా ఉంచుకోండి. దానిని ఎవరికీ, ఎక్కడా ఇవ్వాల్సిన అవసరలేదు' అని ఫౌరసరఫరాల శాఖ తెలిపింది. 

ఇది కూడా చదవండి: Jagan Vs Sharmila: చెల్లికి చెక్.. జగన్ సంచలన వ్యూహం.. ఆ నేతలంతా వైసీపీలోకి..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు