/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/diabetes-in-pregnancy-jpg.webp)
Pregnancy
Pregnancy: గర్భధారణ అనేది స్త్రీకి చాలా సంతోషకరమైన క్షణం. స్త్రీకి తల్లి కావడం అనేది ఒక కల లాంటిది. అయితే చాలా మంది గర్భం దాల్చిన కనీసం మూడు నెలల వరకు ప్రెగ్నెన్సీ గురించి ఎవరికీ చెప్పకూడదని సలహా ఇస్తారు. అసలు ప్రెగ్నెన్సీ విషయాన్ని మూడు నెలలు ఎందుకు దాచిపెడతారు? అందరికీ చెప్పడానికి సరైన సమయం ఎప్పుడు అనే విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
Also Read: Big Breaking: రామమందిర ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత!
ఎందుకు చెప్పరు..?
మొదటి త్రైమాసికం అంటే గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు ప్రతి స్త్రీకి చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో శిశువు ప్రధాన అవయవాలు తల్లి శరీరంలో ఏర్పడతాయి. దీని కారణంగా స్త్రీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందుకే వైద్యులు కూడా గర్భిణీ స్త్రీలను మొదటి మూడు నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. అయితే ఈ మొదటి త్రైమాసికంలోనే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎవరితో పంచుకోవద్దని చెబుతారు. పొరపాటున ఏదైనా నష్టం జరిగితే బాధపడకూడదని ఇలా చేస్తారు. మొదటి మూడు నెలలు దాటిన పిండం బలపడుతుంది. ఆ తర్వాత గర్భస్రావం అవకాశాలు చాలా తక్కువ.
ప్రెగ్నెన్సీ గురించి చెప్పడానికి సరైన సమయం?
శిశువు హృదయ స్పందన, ఎంబ్రియో గ్రోత్ నిర్ధారించడానికి గర్భం దాల్చిన ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాత అల్ట్రాసౌండ్ టెస్టులు చేస్తారు. అప్పుడు లోపల బేబీ హెల్త్ గురించి తెలుస్తుంది. ఆ తర్వాత బయటకు చెప్పడం మంచిది. మొదటి మూడు నెలల్లో ఫ్యామిలీకి మాత్రం చెప్పడం సహాయకరంగా ఉంటుంది. కానీ.. అందరికీ చెప్పాలనుకుంటే మొదటి త్రైమాసికం ముగిసే వరకు వేచి ఉండండి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Trump: ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!