హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!?

బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావుకు బిగ్ షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 120(బి), 386, 409, 506, రెడ్‌విత్‌ 34, ఐటీ యాక్ట్‌ కింద కేసు ఫైల్ చేశారు.

author-image
By srinivas
New Update
harish raooo

Harish rao: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావుకు బిగ్ షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 120(బి), 386, 409, 506, రెడ్‌విత్‌ 34, ఐటీ యాక్ట్‌ కింద కేసు ఫైల్ చేశారు.

అక్రమ కేసులు పెట్టి వేధించారు..


ఈ కేసులో అప్పటి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావుపై కూడా కేసు నమోదైంది. ఈ మేరకు తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి అక్రమ కేసులు పెట్టి దారుణంగా వేధించారని చక్రధర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసు విచారణలో ఉండగా.. బీఆర్‌ఎస్‌ హయాంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులు అరెస్టు అయ్యారు. ఇటీవలే బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కీలకనేత హరీశ్‌రావుపై ఫోన్‌ట్యాపింగ్‌ ఆరోపణల కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. 

Also Read: చెత్తతో నిండిపోయిన భూకక్ష్య..ప్రమాదంలో ఉన్నామంటున్న ఐరాస

వారి పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రద్దు..

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారు. అయన అక్కడే గ్రీన్ కార్డు పొందారు. దీంతో ఈ కేసు విచారణ మరింత కష్టంగా మారింది. ప్రభాకర్ రావు , శ్రవణ్ రావుకు విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసి.. పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలన్నారు. ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు, శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ఇండియన్ ఎంబసీల ముందు హాజరుకావాలని స్పష్టం చేశారు. వారు ఇచ్చే వివరణ బట్టి పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రద్దు చేయాలా? వద్దా? అనే దానిపై పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథారిటీ నిర్ణయం తీసుకోనుంది. 

Also Read: హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్‌.. పదోతరగతి ఉంటే చాలు!

Also Read: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్

Also Read: అడ్వాన్స్ బుకింగ్స్ లో 'పుష్ప2' ర్యాంపేజ్.. ఎన్ని టికెట్స్ అమ్ముడయ్యాయంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు