ఈసారి యాసంగికి 40 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు
తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్ల సాగుకు భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. నీటి సౌలభ్యం ఉన్నందున ఈ యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో సన్నాలు పండించేందుకు రంగం సిద్దం చేస్తోంది. గతేడాది 54.83 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 15 లక్షల ఎకరాల్లోనే సన్నరకం వరి సాగైంది.