తెలంగాణ ప్రభుత్వ శాఖలో అవినితీ తిమింగలాలు.. రూ.500 కోట్ల స్కామ్

నీటిపారుదల శాఖలో రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డ నిఖేష్ కుమార్‌ ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఇదే శాఖలో మరో ఉన్నతాధికారి రూ.500 కోట్లకు పైగా అక్రమార్జన చేశారని ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
IRRIGATION

నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తూ చెరువులు, బఫర్‌జోన్లను కబ్జా చేసి రూ.100 కోట్ల అవినీతిగా పాల్పడ్డ నిఖేష్ కుమార్‌ ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. వివిధ ప్రభుత్వ శాఖల్లో కూడా ఇలాంటి అవినీతి అధికారులకు సంబంధించి పెద్ద లిస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో నిఖేష్ కుమార్ లాంటివారు మరెందరో ఏసీబీకి పట్టుబడే అవకాశాలున్నాయి. తెలంగాణలో భూముల విలువలు భారీగా పెరుగుతుండటంతో గత కొన్నేళ్ల నుంచి కబ్జాలు కూడా పెరిగిపోతున్నాయి. 
 
ప్రస్తుతం స్థలం కొనాలంటే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాలి. అదే చెరువును కబ్జా చేయాలని అనుకుంటే అధికారులకు డబ్బులిస్తే సరిపోతుంది. అందుకే చాలామంది ప్రముఖులు నీటి వనరులకు సంబంధించిన బఫర్‌ జోన్లు, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కూడా పర్మిషన్లు తెచ్చుకున్నారు. మరికొందరు ఏకంగా చెరువులను పూడ్చేసి.. బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి అమ్మేశారు. గత పదేళ్లలో ఓఆర్ఆర్ లోపల 44 నీటి వనరులు పూర్తిగా, 127 పాక్షికంగా ఆక్రమణలకు గురయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. 

Also Read: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!?

వాస్తవానికి చూసుకుంటే చెరువులు, కాలువలు, నదీ పరీవాహక ప్రాంతాల వంటి ప్రభుత్వ ఆస్తులను సంబంధిత శాఖల అధికారులే కాపాడాల్సి ఉంటుంది. ఎవరైనా ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే.. అది చెరువు పరిధిలో ఉంటుందా లేదా అనేది అధ్యయనం చేసి పర్మిషన్ ఇవ్వడమో లేదా రిజెక్ట్ చేయ్యడమో జరుగుతుంది. ఇదంతా కూడా నీటిపారుదల శాఖ పరిధిలోకి వస్తుంది. అయితే కొంతమంది అధికారులు అక్రమార్జనకు అలవాటు పడి ప్రభుత్వ ఆస్తులను ఇతరులకు అప్పగించేశారు. ఇలా వందల కోట్ల స్కామ్ జరిగింది. ఈ కుంభకోణంలో నీటిపారుదల, రెవెన్యూ, GHMC, HMDలకు చెందిన అధికారుల ప్రమేయం ఉంది.  

ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చెరువుల్లో ఇచ్చిన పర్మిషన్లను అధికారులు పరిశీలించారు. అవి ఎప్పుడు ఇచ్చారు, ఇలా ఇచ్చిన అధికారి ఎవరు అనేదానిపై జరిపిన దర్యాప్తులో కొందరు అధికారుల పాత్రను గుర్తించారు. ఆరుగురిపై సెప్టెంబర్‌లో ఫిర్యాదు నమోదైంది. అలాగే ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిన వివరాలు హైడ్రా సేకరించినట్లు తెలుస్తోంది.  

Also Read: తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ల కోసం 'మైత్రి ట్రాన్స్ క్లినిక్స్'

ఇటీవలే నీటిపారుదల శాఖలో నిఖేష్ కుమార్‌ బండారం బయటపడగా.. ఇదే శాఖలో మరో ఉన్నతాధికారి రూ.500 కోట్లకు పైగా అక్రమార్జన చేశారని ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ అధికారి ఆస్తుల వివరాలను ఏసీబీ సేకరిస్తుండటంతో.. అతడు కాపడమంటూ ఉద్యోగ సంఘాల నేతలు, రాజకీయ నేతలు చుట్టు తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: పార్లమెంట్‌లో ప్రియాంక సీటు నెంబర్ ఫిక్స్.. ఆయన పక్కనే!    

ఇది కూడా చదవండి: TG: తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ల కోసం 'మైత్రి ట్రాన్స్ క్లినిక్స్'

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు