/rtv/media/media_files/2025/03/15/VexUFh2nnZ974TCKUXCL.jpg)
CM Revanth Reddy
బోగస్ పింఛన్లను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసలైన లబ్ధిదారులకే పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పింఛన్ తీసుకునే వారందరికీ ఇకపై ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా పేదరిక నిర్మూలన సంస్థ నుంచి జిల్లాలోని గ్రామీణాభివృద్ధి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ నెల 29 నుంచి పెన్షన్లు దారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పింఛన్ పంపిణీలో పారదర్శకతను పెంచే దిశగా ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించింది.
Also Read : ఇళయరాజాకు సుప్రీం కోర్టు బిగ్ షాక్
అసలు లబ్ధిదారులే పింఛన్ తీసుకునే విధంగా..
ఫోటో అప్‌లోడ్ చేసే యాప్‌లో పని చేయడానికి అవసరమైన స్మార్ట్‌ఫోన్లు, వేలిముద్ర పరికరాలు, ఇతర అవసరమైన ఎక్విప్‌మెంట్లు బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు సమకూర్చేలా సూచనలు జారీ అయ్యాయి. అవి అందుబాటులో లేనిపక్షంలో పోస్టుమాస్టర్లు లేదా పంచాయతీ కార్యదర్శులు తమ సొంత ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. పింఛన్ పంపిణీ పూర్తైన తర్వాత ‘చేయూత’ లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోస్టాఫీసుల వద్ద బోర్డుపై ప్రదర్శించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఫేస్ రికగ్నిషన్ విధానం అమలుతో పింఛన్ వ్యవస్థ మరింత నిష్పక్షపాతంగా మారే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: నిద్రపోతున్నప్పుడు ఎందుకు చనిపోతారో తెలుసా..? ఈ కారణం వల్లనే
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 42.67 లక్షల మంది పింఛన్ దారులున్నారు. వారిలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, డయాలసిస్, హెచ్ఐవీ, ఫైలేరియా రోగులు, ఒంటరి మహిళలు తదితరులు ఉన్నారు. వీరి కోసం ప్రతి నెలా రూ.1000.47 కోట్ల మేర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇప్పటికే 22.72 లక్షల మందికి పోస్టల్ శాఖ ద్వారా బయోమెట్రిక్ ద్వారా 19.95 లక్షల మందికి బ్యాంకుల ద్వారా పింఛన్లు అందుతున్నాయి. అయితే వృద్ధుల వేలిముద్రలు సరిగా పడకపోవడం, మరణించిన వారి పేర్లపై ఇంకా పింఛన్లు అందుతున్న అనుమానాలు ప్రభుత్వ దృష్టికి వచ్చాయి. ఈ సమస్యల నివారణకై ఫేస్ రికగ్నిషన్ ఆధారిత వ్యవస్థను తీసుకురావడం ద్వారా మృతుల పేర్లపై పింఛన్ల పంపిణీకి అడ్డుకట్ట పడనుంది. అలాగే అసలు లబ్ధిదారులే పింఛన్ తీసుకునే విధంగా పర్యవేక్షణ మరింత కఠినతరం అవుతుంది. యాప్ ద్వారా ప్రతి నెలా వారి ఫొటో తీసి రికార్డు చేయడం వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో వృద్ధులకు కూడా పింఛన్ అందుకోవడంలో ఎదురయ్యే సమస్యలు తక్కువయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: శివలింగంపై వెం డి పాములను సమర్పించాలో తెలుసా.? శ్రావణ మాసంలో శివకృపకు ప్రతీకగా..
Also Read : ‘పేదల బైక్’.. లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ - ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు సామీ!
( pensions | Revanth Reddy | Latest News | telugu-news )