Ilayaraja: ఇళయరాజాకు సుప్రీం కోర్టు బిగ్ షాక్

ఇళయరాజా 500కి పైగా పాటలకు సంబంధించిన కాపీరైట్‌ వివాదాన్ని బాంబే హైకోర్టు నుంచి మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. 

New Update
Plea Of Ilaiyaraaja

ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన 500కి పైగా పాటలకు సంబంధించిన కాపీరైట్‌ వివాదాన్ని బాంబే హైకోర్టు నుంచి మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఇళయరాజా సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ వినోద్ చంద్రన్, జస్టిస్‌ ఎన్‌.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. 

Advertisment
తాజా కథనాలు