/rtv/media/media_files/2025/03/13/VOmFjZlm1HQ4sggFVSKS.jpg)
Telangana Smart Ration Cards
Smart Ration Cards: తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త. కొత్త రేషన్‌కార్డులను ‘స్మార్ట్’ కార్డుల రూపంలో ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమైంది. క్యూఆర్ కోడ్ కలిగివుండే కార్డులకు సంబంధించి వివిధ రకాల డిజైన్లను పరిశీలిస్తోంది. బిడ్ల దాఖలుకు మార్చి 25వ తేదీ వరకు గడువు ఇచ్చింది.
18 లక్షలకు పైగా కొత్త దరఖాస్తులు..
ఈ మేరకు ప్రస్తుతం తెలంగాణలో 90 లక్షల రేషన్‌కార్డులున్నాయి. కాంగ్రెస్ ప్రజా పాలనతో భాగంగా కొత్త దరఖాస్తులు 18 లక్షలకు పైగానే వచ్చినట్లు సమాచారం. అయితే ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి 1, 8 తర్వాత కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ‘స్మార్ట్’ కార్డు రూపంలో రేషన్‌కార్డులు ఇవ్వాలనే కారణంతో జారీ ప్రక్రియ ఆలస్యమవుతోందని పౌరసరఫరాల శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో పరిశీలన ప్రక్రియ కూడా పూరైనట్లు వెల్లడించింది. ఇప్పటికే రేషన్‌కార్డు ఉన్నవారికి సైతం స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది.
మార్చి 25 వరకు తుది గడువు
ఇందులో భాగంగానే పౌరసరఫరాల శాఖ టెండర్లు ఆహ్వానించింది. బిడ్ల దాఖలుకు మార్చి 25 తుది గడువు ప్రకటించింది. ప్రీ బిడ్ సమావేశాన్ని మార్చి 17న నిర్వహిస్తామని తెలిపింది. మహిళనే కుటుంబ యజమానిగా పేర్కొంటూ ఆమె పేరుతోనే రేషన్‌కార్డులు జారీ చేయనున్నారు. స్మార్ట్ రేషన్‌కార్డులపై కూడా మహిళల ఫొటోనే ఉండనుంది. రేషన్ షాపులో కేవలం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఆ కుటుంబంలో రేషన్ అర్హుల వివరాలన్నీ చూపించనుంది. ఈ విధానం ఇప్పటికే రాజస్థాన్, కర్ణాటక, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లో అమలవుతోంది.
ఇది కూడా చదవండి: ప్రైవేట్ భాగంలో దురద రాకుండా ఉండటానికి ఇలా చేయండి
ఇక స్మార్ట్ కార్డుపై తెలంగాణ ప్రభుత్వం లోగో. రేషన్‌కార్డు నంబర్. కుటుంబ పెద్ద పేరు. రేషన్ షాపు నంబర్. హోలో గ్రామ్. సంబంధిత అధికారి సంతకం ఉంటాయి. వెనుక వైపు జిల్లా, మండలం, గ్రామం, క్యూ ఆర్ కోడ్, రేషన్ కార్డుదారుడి చిరునామా ఉండనున్నాయి.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?