Smart Ration Cards: ‘స్మార్ట్ రేషన్ కార్డు’లు వచ్చేస్తున్నాయహో.. మార్చి 25న దానికి తుది గడువు!
తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త. కొత్త రేషన్‌కార్డులను ‘స్మార్ట్’ కార్డుల రూపంలో ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమైంది. క్యూఆర్ కోడ్ కలిగివుండే కార్డులకు సంబంధించి వివిధ రకాల డిజైన్లను పరిశీలిస్తోంది. బిడ్ల దాఖలుకు మార్చి 25వ తేదీ వరకు గడువు ఇచ్చింది.