/rtv/media/media_files/2024/12/28/qvSgHr1LrBOp4Zh0F4OP.jpg)
Telangana government allocates Rs. 11,600 crore for school education
TG Education: దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా విద్యకోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి రూ.11,600 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన భట్టి, మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గత కొద్ది నెలల క్రితం ప్రజా ప్రభుత్వం మూడు పాఠశాలలు మంజూరు చేసి నిధులు కేటాయించిదని తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు..
విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55 పాఠశాలలకు నిధులు కేటాయిస్తూ విద్యాశాఖ అధికారులతో ఉత్తర్వులు విడుదల చేయించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మాణం చేయబోతున్నాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మాదిరిగా దేశంలో ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఉండవు. సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, అందులో విద్యా బోధన చేసే ఉపాధ్యాయులకు కూడా అక్కడే వసతి కల్పించడానికి గృహ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు.
డిజిటల్ విద్యా బోధన..
విద్యార్థులకు అన్ని వసతులతో పాటు సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ విద్యా బోధన జరుగుతుంది. ఈ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన ల్యాబ్స్, లైబ్రరీ తో పాటు మినీ థియేటర్ కూడా ఉండేలా డిజైన్ చేశాం. పేద బడుగు బలహీనవర్గాల కుటుంబాలకు ఉపయోగపడేలా, అంతర్జాతీయ స్థాయిలో ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి విధంగా సిలబస్ ను కూడా రూపొందించామని చెప్పారు.
Also read: Kumbh Mela: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీషీటర్
పేద బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మా హయాంలో ఏర్పాటు కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనతో ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఒక సామాజిక మార్పు కోసం పూనుకున్నారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల అభ్యున్నతికి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పూనుకొని పనిచేయాలని చెప్పారు. మార్గ నిర్దేశకాన్ని తూచా తప్పకుండా అమలు చేయడంలో భాగంగానే ప్రజా ప్రభుత్వం ఈ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుందన్నారు.
Also read: నడిరోడ్డుపై జర్నలిస్ట్‌ను కాల్చి చంపిన దుండగులు
భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ప్రపంచాన్ని శాసించే సంస్థల్లో పని చేసే విధంగా ఇందులో చదివే విద్యార్థులు ఎదుగుతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కటేసారి 55 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకుగాను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ పోగేస్తున్న ప్రతి పైసా ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి ప్రజా ప్రభుత్వం వినియోగిస్తుంది. అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కొరకు ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు.