Telangana: కులమే కాదు.. ఆస్తి, అప్పులతో పాటు ఆ 75 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రంగం సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి 20 రోజులపాటు అధికారులు సర్వే చేపట్టనున్నారు. మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ లో సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్నారు. తప్పులు చెప్పినవారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నారు. By srinivas 03 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి TG News : తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రంగం సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి 20 రోజులపాటు అధికారులు సర్వే చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ఇండ్లకు నంబర్లు వేసే పనిలో సిబ్బంది బిజీగా ఉండగా.. 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్ ను నియమించినట్లు సమాచారం. కాగా ఈ సర్వేతో తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయం లెక్క తేలుతుందని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. అయితే సర్వేలో కులం, మతం, ఆస్తి, అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ హెచ్చరించారు. Also Read : రేపే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మొత్తం 75 ప్రశ్నలు.. ఈ మేరకు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు నిరంజన్ తెలిపారు. కుటుంబ సర్వేలో కులంతో పాటు ఆదాయం, ఆస్తులు వంటి వ్యక్తిగత వివరాలను వెల్లడించాలని సూచించారు. మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ లో సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఆయా కులాల జనాభా ఎంత, కుటుంబంలో సభ్యులెందరు, ఏం చదువుకున్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఆస్తిపాస్తుల వివరాలు, ఎలా సంపాదించారు, ఏ పథకాల లబ్ధిపొందారు వంటి అంశాలను రికార్డు చేయనున్నారు. Also Read : ఛత్తీస్‌గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 6గురు దుర్మరణం! ప్రతి కుటుంబానికి ఒక సీరియల్ నంబర్.. ఇక ప్రతి కుటుంబానికి ఒక సీరియల్ నంబర్ కేటాయించారు. మొదటి దశ11 కాలమ్స్ లో సాధారణ వివరాలు నమోదు చేస్తారు. కుటుంబ యజమానితో పాటు మొత్తం సంఖ్య, మాతృభాష, జెండర్, మతం, కులం, వయసు, ఆధార్ నంబర్ వివరాలు నమోదు చేయనున్నారు. రెండో దశలో 12 నుంచి 19 కాలమ్ లో విద్య వివరాలు సేకరిస్తారు. మొబైల్ నంబర్, దివ్యాంగుల రకం, వైవాహిక స్థితి, స్కూల్లో చేరే నాటికి వయసు, విద్యార్హత, మీడియం, స్కూల్ మానేయడానికి కారణాలు ఇందులో రికార్డు చేయనున్నారు. Also Read : హైదరాబాద్ కస్టమర్‌ను చీట్ చేసిన Swiggy.. జరిమానా ఎంతో తెలుసా!? ఉద్యోగ ఉపాధి వివరాలు.. ఇక 20 నుంచి 30వ కాలమ్ లో ఉద్యోగ ఉపాధి వివరాలు రికార్డు చేస్తారు. 31 నుంచి 40 కాలమ్ లో భూమి వివరాలు, ధరణి పాస్ బుక్ నంబర్, భూమిని ఏ రూపంలో పొందారు, పట్టానా, అసైన్డ్ భూమినా, అటవీ హక్కుల కింద పొందారా, నీటిపారుదల సౌకర్యం ఉందా, కౌలుభూమిలో సాగు చేస్తున్నట్టయితే విస్తీర్ణం వివరాలు సేకరించనున్నారు. 41 నుంచి 45 కాలమ్ లో రిజర్వేషన్ ప్రయోజనాలు నమోదు చేయనున్నారు. 46 నుంచి 48లో రాజకీయ నేపథ్యం, వలసల వివరాలుంటాయి. 48 నుంచి 56లో ఆస్తులు, అప్పుల వివరాలు. ఈ ఐదేండ్లలో తీసుకున్న లోన్లు, వాటి అవసరం, ఎక్కడి నుంచి తీసుకున్నారనే వివరాలుంటాయి. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నారా? పశుసంపద ఎంత? ఆస్తులు, వాహనాలు, రేషన్ కార్డు నంబర్, నివాస గృహం విస్తీర్ణం, ఇల్లు రకం, తాగునీటి వనరు, కరెంట్, బాత్రూమ్, వంటకు ఏ ఇంధనం వాడుతున్నారో అన్ని పక్కాగా తెలపాల్సివుంటుందని అధికారులు చెబుతున్నారు. Also Read : మహిళా డాక్టర్ కు బైకర్ వేధింపులు.. శృంగార వీడియోలు పంపిస్తూ! #telangana #survey #CM Revanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి