హైదరాబాద్ కస్టమర్‌ను చీట్ చేసిన Swiggy.. జరిమానా ఎంతో తెలుసా!? కస్టమర్‌ను మోసం చేసినందుకు స్విగ్గీ సంస్థకు రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం రూ.25,000 జరిమానా విధించింది. స్విగ్గీ వన్ సభ్యత్వం పేరుతో 9.7 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని 14 కిలోమీటర్లుకు పెంచి, కస్టమర్‌ను తప్పుదోవ పట్టించినందుకు జరిమానా విధించింది. By Kusuma 03 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి స్వీగ్గీ ఫుడ్ డెలివరీ యాప్‌ను సిటీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ఓ కస్టమర్ ఫుడ్ డెలివరీ చేసుకోగా.. డెలివరీ దూరాలను పెంచి, స్విగ్గీ వన్ సభ్యత్వం కింద చార్జీలు వసూలు చేసింది. ఇక్కడితో ఆగకుండా కస్టమర్‌ను తప్పుదోవ పట్టించింది. దీంతో స్విగ్గీ సంస్థకి రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం రూ.25,000 జరిమానా విధించింది. ఇది కూడా చూడండి: ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి! మానసికంగా వేధించినందుకు.. వినియోగదారుడిని స్విగ్గీ సంస్థ మానసికంగా వేధించినందుకు రూ. 5వేలు, న్యాయపరమైన ఖర్చులకు రూ.5వేలు చెల్లించాలని కన్స్యూమర్ ఫోరం ఆదేశించింది. దీంతో పాటు డెలివరీ పార్టనర్ ఫీజుగా రూ.350.48 వసూలు చేసిన డబ్బుకి 9 శాతం వడ్డీ కలిపి రూ.103ను తిరిగి ఇవ్వాలని కన్స్యూమర్ ఫోరం సూచించింది. ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు! బాలానగర్‌కి చెందిన సురేష్ గతేడాది స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. స్విగ్గీ 9.7 కిలోమీటర్ల దూరానికి రూ.103 వసూలు చేసింది. ఎక్కువ ఎందుకు చెల్లించడమని అతను ఉచిత డెలివరీ సేవలు పొందడానికి స్విగ్గీ వన్ సభ్యత్వాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఆర్డర్ పెట్టగా స్విగ్గీ.. 9.7 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని 14 కిలోమీటర్లకు పెంచింది. ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ వన్ సభ్యత్వం అని పెట్టి.. తీరా కిలోమీటర్లు పెంచి కస్టమర్ నుంచి డబ్బులు వసూలు చేసింది. దీంతో ఆయన స్విగ్గీ కస్టమర్ కేర్‌ను సంప్రదించగా.. మొబైల్ GPSని ఉపయోగించి డెలివరీ మార్గాన్ని తగ్గించవచ్చని తెలిపింది. దీంతో సురేష్ పరిహారం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై ఫోరమ్ స్విగ్గీకి నోటీసులు అందించిన కూడా స్పందించలేదు. దీంతో వినియోగదారుల ఫోరమ్.. కేసు నిజాలను పరిగణించి ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం #online-food #rangareddy-district #swiggy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి