ఛత్తీస్‌గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 6గురు దుర్మరణం! ఛత్తీస్‌గఢ్ రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. స్కార్పియో కారు అదుపు తప్పి నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు చికిత్సపొందుతూ మరణించారు. By srinivas 03 Nov 2024 | నవీకరించబడింది పై 03 Nov 2024 11:39 IST in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Accident: ఛత్తీస్‌గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధా బాగీచా ప్రధాన రహదారిపై అతివేగంగా వెళ్తున్న స్కార్పియో కారు అదుపు తప్పి నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు చికిత్సపొందుతూ మరణించారు. ఓ బాలిక, ఓ మహిళ సహా ఆరుగురు.. కుస్మి నుంచి సూరజ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికుల తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఓ బాలిక, ఓ మహిళ సహా ఆరుగురు పురుషులున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ తోపాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ ఇరువురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరినట్లు పోలీసులు తెలిపారు. #chattisgarh #accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి