Iran: రేపే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఎన్నికల నేపథ్యంలో రేపే ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు ఇరాన్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇరాక్‌ భూభాగంపై భారీగా యుద్ధ సామగ్రిని ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

New Update
dfd ede

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఎన్నికలకు ఒక రోజు ముందు ఇజ్రాయెల్ పై దాడులు చేయాలని ఇరాన్ వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. కాగా రేపే ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాక్ భూభాగంపై దాడులకు అంతా సిద్ధం చేసింది ఇరాన్. ఇరాక్‌ భూభాగంపై భారీగా యుద్ధ సామగ్రిని ఏర్పాటు చేసిన ఇరాన్.. సుప్రీం లీడర్‌ ఖమేని ఆదేశించిన వెంటనే రాకెట్లు, క్షిపణులతో దాడులు చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు ఇరాన్ దాడులను ముందే పసిగట్టిన ఇజ్రాయెల్.. దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. 

ఇది కూడా చదవండి: కులమే కాదు.. ఆస్తి, అప్పులతో పాటు ఆ 75 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే

ఇదే సరైన సమయంగా భావిస్తున్న ఇరాన్.. 

ఇక నవంబర్‌ 5న అమెరికాలో ఎన్నికలు జరగనుండగా.. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి ఇదే సరైన సమయమని ఇరాన్ భావిస్తోంది. ఎన్నికలకు ముందు దాడులు చేసి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ డెమోక్రటిక్‌ పార్టీని కోలుకోలేని దెబ్బతీయాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. అయితే ఇజ్రాయెల్‌కు యుద్ధంలో ఆయుధ, ఆర్థిక సాయమందిస్తున్న అమెరికా.. ఇరాన్ దాడులను తిప్పికొట్టడంలో కీలకంగా వ్యవహరించనుంది. 

ఇది కూడా చదవండి: Ration Cards: జనవరి నుంచే కొత్త రేషన్ కార్డులు.. ఫస్ట్ ఇచ్చేది వారికే!

ఇజ్రాయెల్, అమెరికాలకు స్ట్రాంగ్ వార్నింగ్..

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేని ఇజ్రాయెల్, అమెరికాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తమపై దాడులు చేస్తే ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని, ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ తీస్తామని హెచ్చరించారు. ఇరాన్‌ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులపై అయతొల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇరాన్‌, రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ విషయంలో ఇజ్రాయెల్‌, అమెరికాలు చేస్తున్న పనులకు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. 

Also Read :  కార్తీక మాసంలో ఆ చెట్టు కింద భోజనం చేస్తే..!

Also Read :  ట్రంప్ విజయం గ్యారంటీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు