మహిళా డాక్టర్ కు బైకర్ వేధింపులు.. శృంగార వీడియోలు పంపిస్తూ! కోల్ కతాలో మరో వైద్యురాలు కామాంధుడి వేధింపులకు గురైంది. బైక్ బుక్ చేసి క్యాన్సిల్ చేసిందనే కోపంతో దారుణంగా టార్చర్ చేశాడు ఓ బైకర్. ఆమెకు 17 సార్లు ఫోన్ చేసి విసిగించడంతోపాటు శృంగార వీడియోలు పంపించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. By srinivas 03 Nov 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Kolkata: బైక్ బుక్ చేసి క్యాన్సిల్ చేసిందనే కోపంతో మహళా డాక్టర్ ను దారుణంగా టార్చర్ చేశాడు ఓ బైకర్. ఆమె నెంబర్ సేవ్ చేసుకుని పదే పదే ఫోన్ చేసి విసిగించాడు. అంతటితో ఆగకుండా వల్గర్ మెసేజ్ లు పెట్టడంతోపాటు శృంగార వీడియోలు సైతం పంపించాడు. దీంతో కంగుతిన్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కోల్ కతాలో చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇది కూడా చదవండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం 17 సార్లు ఫోన్ చేసి.. ఈ మేరకు కోల్‌కతా పట్టణంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది ఓ మహిళ. అయితే శనివారం రాత్రి ఇంటికి వెళ్లేందుకు ఓ యాప్‌లో బైక్ బుక్ చేసుకుంది. బైక్ రావడానికి ఆలస్యం కావడతో రైడ్ క్యాన్సిల్ చేసుకుంది. దీంతో సదరు బైకర్ ఆమెకు 17 సార్లు ఫోన్ చేశాడు. ఆమె నిరాకరించడంతో ఆమె వాట్సప్ నంబర్‌కు రతికి సంబంధించిన వీడియోలు పంపించాడు. ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె పుర్బా జాదవ్‌పుర్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: Gold Price: ఇదే మంచి అవకాశం.. భారీగా తగ్గిన బంగారం ధర #bike-ride #kolkata #doctor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి