/rtv/media/media_files/2025/08/04/komatireddy-cm-revanth-phone-2025-08-04-12-50-27.jpg)
నల్గొండలో తన క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను సీఎంకు కోమటిరెడ్డి వివరించారు. రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కావాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కందూరు జైవీర్ రెడ్డితోనూ సీఎం మాట్లాడారు. ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి వెంకట్ రెడ్డి సీఎంతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంత్రి కోమటిరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్
— Telugu Reporter (@TeluguReporter_) August 4, 2025
నల్గొండలో క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. pic.twitter.com/HaMbWyNrJF
నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ రోజు మంత్రి క్యాంపు కార్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజను నిర్వహించారు. నల్గొండలో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో, 22 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను నిర్మించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. తెలంగాణ విద్యా రంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా విప్లవాత్మక మార్పు ప్రారంభమైందన్నారు. పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.
తెలంగాణ విద్యా రంగంలో నూతన శకం..
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 4, 2025
నల్గొండలో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో, 22 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు ఈరోజు భూమిపూజ నిర్వహించడం గర్వకారణం.
తెలంగాణ విద్యా రంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్… pic.twitter.com/ReYkP7HZYq
అంతర్జాతీయ ప్రమాణాలతో, డిజిటల్ లైబ్రరీలు, స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్‌లు వంటి ఆధునిక హంగులతో, హైటెక్ డిజిటల్ విద్యాబోధనతో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ చేపట్టినట్లు చెప్పారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఇలాంటి చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ స్కూల్ ను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కోమటిరెడ్డి. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మరో సారి సీఎం కావాలని పూజలు నిర్వహించినట్లు చెబుతుంటే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మాత్రం తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సీఎంకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి చెప్పడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని ఇటీవల ట్వీట్ చేశారు. ఇటీవల సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సైతం కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలని సూచించారు. అంతే తప్పా అవమానించడం సబబు కాదన్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం సరికాదని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ విభజించి పాలించడమేనని ఫైర్ అయ్యారు.